ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఇండియన్ రెడ్ క్రాస్ హనుమకొండ జిల్లా సర్వ సభ్య సమావేశము మంగళవారం సమీకృత కార్యాలయ భవనము (కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ ) సుబేదారిలో జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజీవ్ గాంధీ హన్మంతు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజీవ్ గాంధీ హన్మంతు, పాలకవర్గం రెడ్ క్రాస్ సొసైటీ ఫౌండర్ జీన్ హెన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినారు.
ముందుగా హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ వార్షిక నివేదికను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా సబ్యులకు వివరించారు. పాలకవర్గ సభ్యుడు పాపి రెడ్డి గడిచిన సంవత్సరాల వార్షిక నివేదిక 2018 -19 నుండి 2021 -22 ల అడిటెడ్ అకౌంట్స్, రాబోయే సంవత్సర ఆదాయ ఖర్చుల అంచనా ఫై వివరించారు. గత సమావేశం లోని తీర్మానాల అమలు గడిచిన సంవత్సర వార్షిక నివేదిక 2018 -19 నుండి 2021 -22 ల అడిటెడ్ అకౌంట్స్, రాబోయే సంవత్సర ఆదాయ ఖర్చుల అంచనా ఫై వార్షిక నివేదికను ప్రవేశ పెట్టగా ప్యాట్రన్ నాయిని రాజేందర్ రెడ్డి ప్రతిపాదించగా ప్యాట్రన్ రావులపెల్లి అనిల్ కుమార్, సభ్యులు అప్పం కిషన్ సభ్యులు బలపరిచారు. అందుకు సభ్యులు అందరు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినారు. ఈ సందర్బంగా హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ కి సహాయ సహకారాలు అందించిన కలెక్టర్ కి అభినందనలు తెలిపినారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ ప్రస్తుత పాలకవర్గం ప్రజా సేవ కార్యక్రమాలలో ముందువుందని పాలకవర్గాన్ని అభినందించారు. ఇక ముందు కూడా తనవంతుగా రెడ్ క్రాస్ సొసైటీ కి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ సేవా తత్పరతతో కూడినదని ప్రస్తుత పాలకవర్గం అనేక సేవ కార్యక్రమాలు చేసిందని పాలకవర్గాన్ని అభినందించడం జరిగింది. జీవిత కాల్ సభ్యులు రెడ్ క్రాస్ సేవాకార్యక్రమాలలో విరివిగా పాల్గొని ప్రజలకు సేవలందించాలని అన్నారు. ప్రస్తుత పాలకవర్గ కాలము పూర్తి అయిపోయినందున జీవిత కల సభ్యుల అభిప్రాయము మేరకు పదిరోజులలో ఎన్నికల అధికారిని నియమిస్తానని తెలిపినారు. తదనంతరం ప్యాట్రన్ లకు మెమెంటో, శాలువాతో మరియు రాష్ట్ర అవార్డు గ్రహీతలకు గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ మరియు సిల్వర్ మెడల్స్ ప్రదానం చేసినారు.
ఈ సమావేశం లో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ వైస్ చైర్మన్ డాక్టర్ కె. సుధాకర్ రెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు: ఈ. వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాస్ రావు, బొమ్మినేని పాపి రెడ్డి, డాక్టర్ టి. విజయలక్ష్మి, పెద్ది వెంకట్ నారాయణ గౌడ్, జయశ్రీ చెన్నమనేని, బి. హరి ప్రసాద్, డిఆర్డిఓ ఏ. శ్రీనివాస్ కుమార్, టిజిఓ , టిఎన్జిఓస్ , ప్రతినిధులు, రెడ్ క్రాస్ పాట్రన్స్ నాయిని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, పొన్నాల రామ్ మోహన్, రావుల అనిల్ కుమార్, శాశ్వత సభ్యులు: బిళ్ళ రమణ రెడ్డి, బండి సారంగపాణి, ఫి. రాకేష్, కట్ల శ్రీనివాస్, నమిండ్ల శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీనివాస్, నాదేం శాంతి కుమార్అ, అప్పం కిషన్, కుసుమ శ్యామ్ సుందర్, నేహాల్, పుల్లూరు వేణు, యాకుబ్ రెడ్డి, కే. అనితా రెడ్డి, ట్రాన్సజెండర్ స్టేట్ ప్రెసిడెంట్ లైలా, ట్రాన్సజెండర్స్ మరియు జీవితకాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: