ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
మహబూబాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, మేయర్ గుండు సుధారాణి, స్థానిక మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, స్థానిక నాయకులు, తదితరులు కలిసి జిల్లా పార్టీ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్ సభాస్థలి ప్రారంభోత్సవ తుది ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ ఛాంబర్లో అమ్మవారి పూజలో పాల్గొని, ఆశీర్వాదం తీసుకున్నారు.
ఎక్కడ ఎలాంటి పొరపాట్లు, లోటు పాట్లు లేకుండా చూడాలని కలెక్టర్, పోలీసు, నాయకులు, బాధ్యులకు చెప్పారు.
పూజా కార్యక్రమాలలో కలెక్టరు శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులు పాల్గొన్నారు.
అనంతరం సీఎం భోజన ఏర్పాట్లు, ప్రజా ప్రతినిధుల సమావేశ ప్రాంగణాన్ని , వారి భోజన ఏర్పాట్లు పరిశీలించారు.

Post A Comment: