ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
వరంగల్ జిల్లా
పర్వతగిరిలో
ఆధ్యాత్మిక గురువు, భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం పర్వతగిరి రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో లయోలా హైస్కూల్లో విద్యార్థులతో కలిసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్ రావు, స్కూల్ యాజమాన్యం మరియు రామకృష్ణ సేవాసమితి నిర్వాహకులు పాల్గొన్నారు.

Post A Comment: