ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
దివంగత పోలీసు కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన ఆర్ముడ్ రిజర్వు హెడ్ కానిస్టేబుల్ సిరికొండ రామ్ నరసింహారావు సతీమణి లావణ్యకు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రూ. 60 వేల చెక్కును ఎస్పి సురేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పి దివంగత హెడ్ కానిస్టేబుల్, కుటుంబ పరిస్థితి, కుమారుల చదువు, కెరీర్ గురించి ఆరా తీసి, దివంగత పోలీసుల పిల్లలు ఉన్నతంగా ఎదగాలని ఎస్పి గారు అన్నారు. అలాగే చనిపోయిన పోలీస్ కుటుంబాలకు జిల్లా పోలీసు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రభుత్వం ద్వారా బాధిత కుటుంబానికి రావలసిన అన్ని రకాల లబ్ధి సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దివంగత హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు, జిల్లా పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్ సోఫియా సుల్తానా పాల్గొన్నారు.

Post A Comment: