ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ మంచి వక్త, మేధావి, జాతీయస్థాయిలో పేరున్న రాజకీయ నేత అని, అలాంటి వ్యక్తి మన కొడకండ్ల ముద్దుబిడ్డ కావడం మనకు గర్వకారణమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
నేడు పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్లలో ఉన్న ఆనంద భాస్కర్ నివాసానికి మంత్రి తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి ప్రసంగించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా రాపోలు ఆనంద భాస్కర్ ను నేను అభిమానిస్తాను.
మంచి వక్త, మేధావి, రాజకీయ నేత.
సీఎం కేసీఆర్ స్వయంగా అన్న మాటలు ఇవి.జాతీయ స్థాయిలో మంచి పేరు ఉంది. కొడకండ్ల ముద్దు బిడ్డ కావడం గర్వించ దగిన విషయం
పార్టీలు వేరు అయినా నేను ఎప్పుడు కనిపించినా సలహాలు ఇచ్చేవారు. మన పార్టీలో చేరడం మన అదృష్టం.టెక్స్టైల్ పార్క్ త్వరలో కేటీఆర్ గారి చేతుల మీదుగా పని మొదలు పెట్టించి, చేనేతకు పని కల్పిస్తాం.
12వ తేదీన మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ప్రారంభానికి ముఖ్యులు,
18వ తేదీన బి. ఆర్.ఎస్ పార్టీ తొలి బహిరంగ సభకు పెద్ద ఎత్తున రావాలి.
కంటి వెలుగు మంచి కార్యక్రమం .మంచి టీమ్ వస్తుంది. 100 రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఆపరేషన్లు చేయించ బాధ్యత మనమే తీసుకోవాలి.
క్యాంప్ పూర్తి అయ్యే వరకు ముఖ్య నాయకులు అంతా అక్కడే ఉండాలి.
ఈ 100 రోజుల కార్యక్రమం విజయవంతం చేయాలి.
ఆనంద భాస్కర్ పార్టీలోకి వచ్చినందుకు ధన్యవాదాలు.
రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ కీలక యోధులు,
దయన్న దండు,
గోదావరి జలాలు తాగుతున్న ధన్య జీవులకు నమస్కారాలు.
తెలంగాణకు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తెలంగాణ ఆపన్నులకు పెద్ద కొడుకు. అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు పూర్వ ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద కొడుకు.వీరిద్దరినీ మనం కాపాడుకోవాలి. ఇందులో నా వంతు సాయం నేను పూర్తిగా అందిస్తాను. కేసిఆర్ సంకల్పం సిద్ధించాలంటే అందరూ ఏకం కావాలి.అధికార పక్షం వైపు కొంత తీక్షణ చూపులు ఉంటాయి. అయినా మనమే ఓపికగా అందరినీ కలుపుకొని వెళ్ళాలి.కంటి వెలుగు మామూలు వెలుగు కాదు. శాస్త్రీయ వెలుగు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వెలుగు.
దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
నాకు పేగు బంధం, మట్టి బంధం ఈ ప్రాంతంతో ఉంది.
ఆ బంధాన్ని మీతో పంచుకుంటూ మీలో ఒక్కడిగా ఉంటాను

Post A Comment: