ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా విచ్చేసిన జడ్జి పద్మజా రెడ్డి మహిళా ఉద్యోగులను ఉద్దేశించి వారి కర్తవ్యాలను గురించి మాట్లాడారు. మహిళా ఉద్యోగులు ఉద్యోగంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండాలని , మహిళలు మగవారితో సమానంగా కష్టపడుతున్నారని తెలిపారు. గృహిణి అయినా, ఉద్యోగిని అయిన మహిళకి పౌష్టిక ఆహారం ఎంతో అవసరం అని తెలిపారు. ఉద్యోగంతో పాటు కుటుంబముతో కూడా కొంత సమయాన్ని తప్పనిసరిగా కేటాయించాలని అన్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను ఉద్దేశించి ఆడపిల్లలను చిన్నప్పటినుంచి ఎలా మెలగాలో గమనించాలని పెళ్లి అయ్యాక కూడా వారి అవసరాలను, సమస్యలను తెలుసు తెలుసుకోవాలని చెప్పారు. ఒక ఇంట్లో ఒక స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబంలో అందరూ విద్యావంతులవుతారని తెలిపారు. పాతకాలంలో ఆడవాళ్ళని ఇంటికి, వంటింటికి మాత్రమే పరిమితమయ్యే లా పెంచేవారు. ఈ జనరేషన్ లో ఆడ మగ తేడా లేకుండా పోటీ పడుతున్న రోజుల్లో ఆడపిల్లపై అత్యాచారాలు జరగకుండా సెల్ఫ్ ప్రొటెక్షన్ నేర్పాలన్నారు. ఆడపిల్లకి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఎరువురి కుటుంబాల మధ్య ప్రీ మ్యారీడ్ లైఫ్ కౌన్సిలింగ్ అనేది ఉండాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ ఐ డి ఓ సి మహిళా ఉద్యోగులు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో వివరించారు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక సోషల్ మీడియా కి దూరంగా ఉండి కుటుంబంతో పిల్లలతో సమయం కేటాయించాలని తెలిపారు. అలాగే తన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు. కో-ఆపరేటివ్ కార్యాలయ అధికారిని నీరజ మాట్లాడుతూ మహిళలు లేకుంటే కుటుంబమే ఉండదని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, మన పిల్లలకి మన పూర్వీకుల గొప్పతనాన్ని చెప్తూ రామాయణం మహాభారతం వంటి పురాణాలను గురించి నేర్పించాలని జ్ఞానం అంతా మన దగ్గరే ఉందని అద్భుతమైన సంపద మన దగ్గర ఉందని తెలిపారు. అనంతరం జెసి గారు ఐడిఓసి మహిళా ఉద్యోగినిలో కమిటీ ఏర్పాటు చేసిన వారి పేర్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐ డి ఓ సి మహిళా అధికారులు మరియు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.


Post A Comment: