మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంధత్వ రహిత తెలంగాణ రాష్ట్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యమని... తెలంగాణలో అంధత్వ నివారణ కోసం కంటి వెలుగు కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం విలేజ్ అంతర్గాం గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శరీరంలో మనిషికి కంటి చూపు అత్యంత ప్రాముఖ్యమైనదని ప్రజలు కంటిచూపు సమస్యతో బాధపడవద్దని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దేశం గర్వించే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ఖమ్మం మహాసభలో విచ్చేసిన ముఖ్యమంత్రిలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంతగానో కిర్తించారన్నారు. ఇధే తరహ పధకం తమ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశించే పెడతామని చెప్పరన్నారు. 75 ఎళ్ల స్వాతంత్ర్య భారతంలో ఎంతో మంది నాయకులు దేశాన్ని పాలించారని పేద ప్రజల కోసం ఆలోచన చేసిన మహనేత సిఎం కేసీఆర్ అని అన్నారు దేశ ప్రజలంతా రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని దేశానికి ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన నిలుస్తుందన్నారు. మన కోసం నిత్యం శ్రమిస్తున్న కేసీఆర్ కు మద్దతుగా నిలువాలన్నారు. పేద ప్రజలంతా కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ ఆముల నారాయణ ఎంపిడిఓ యాదగిరి సర్పంచ్ తుంగపిండి సతీష్ కో ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా నాయకులు కోల సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: