ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని భీమదేవర పల్లి మండలం, ముల్కనూర్ లో గల రైతు వేదిక లో గురువారం జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ స్వయంగా శిబిరంలో నేత్ర పరీక్ష చేయించుకున్నారు .
ఈసందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ కంటి చూపు చాలా ముఖ్యమైనది అన్నారు. ప్రతి పేదవాడికి పూర్తి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టిన రెండో విడత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే కంటి వెలుగు మొదటి విడత విజయవంతం ఐయ్యింది అని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులు వైద్య సిబ్బంది కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యసాధన దిశగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని,అందరికీ కళ్లద్దాలు అందేలా చూడాలన్నారు.

Post A Comment: