మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
20వ డివిజన్ లొ కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించిన స్థానిక కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్. ఈ సందర్భంగా కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతు " తెలంగాణ సాధించిన మన అభినవ అంబేద్కర్ కె.సి.ఆర్ సమాజంలొని పేద, ధనిక, వర్గ, వర్ణ ల తేడా లేకుండా ప్రజలందరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని, అందులొ బాగంగా బృహత్తర కార్యక్రమం కంటి వెలుగు అని, ఇటువంటి చక్కటి ఆరోగ్యకర కార్యక్రమంలొ ప్రజాప్రతినిధి గా భాగస్వామ్యం అవడం గొప్పగా భావిస్తున్నానని, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి.చందర్ మేయర్, డిప్యూటి మేయర్ బి.అనిల్ కుమార్, ఎన్.అభిషేక్ రావు మరియు కమీషనర్ సుమన్ రావు ల చొరవతొ, డివిజన్ ప్రజల సహకారంతొ కంటి వెలుగు విజయవంతం చేయడానికి కృషి చేస్తామని, 20వ డివిజన్ లొని ప్రజలందరూ ఈ కంటి వెలుగు కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని, డివిజన్ ప్రజల భాగస్వామ్యంతొ అరోగ్య డివిజన్ గా నిలిచేల నిరంతర ప్రయత్నం చేస్తామని " అన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలొ డా,,మాధురి, డా,,చేరాలు, డిఇ మాధవి, వార్డ్ ఆఫీసర్ యం.శంకర్, హెచ్.ఒ సమ్మయ్య, అకౌంటెంట్ విశ్రాంతి, ఏ.ఎన్.యంలు లక్ష్మి, బాగ్యలక్ష్మి, సుగుణ, పద్మ, అంగన్వాడి టీచర్లు శ్రీదేవి, అతియా, నీల, రేణుక, అశావర్కర్లు తిరుమల, లత, రాజేశ్వరి, ఆపరేటర్ హరీష్, సానిటేషన్ సూపర్వైజర్ తిరుపతి, ఎలక్ట్రిషియన్లు ప్రేమ్, శంకర్ లతొ పాటు స్థానిక నాయకులు ఎస్.కె.బాబుమియా, కె.కె.స్వామి, కె.మల్లేష్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: