ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

మహిళలపై ఆసిడ్, పెట్రోల్ దాడులు అత్యంత దారుణం, చాలా పెద్ద నేరాలని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జె.ఉపేందర్ రావు పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యచరణలో భాగంగా, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జె.ఉపేందర్ రావు వరంగల్ జిల్లా కృష్ణ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాసిడ్ దాడి-న్యాయ సహాయం అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, 

మహిళలపై ఆసిడ్ , పెట్రోల్ దాడులు అత్యంత కిరాతకము, క్రూరమైన నేరాలని, ఆడపిల్లలపై ఆసిడ్ దాడులు జరగకుండా, విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  పాఠశాలల్లో, కళాశాలలలో యువత క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా న్యాయ సేవాధికార సంస్థలు  అవగాహన సదస్సులు నిర్వహించి, విద్యార్థీ, విద్యార్థినులను చైతన్య పరుస్తున్నాయని తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి 1860 సెక్షన్ 326-A కింద కనీస శిక్ష 10 సంవత్సరాల జైలు శిక్ష, ఇది జీవిత ఖైదు మరియు జరిమానా వరకు పొడిగించబడుతుంది అని తెలిపారు.  యాసిడ్ దాడి ప్రభావం మరియు బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల రీత్యా న్యాయ సేవాధికార సంస్థలు వైద్య సేవల కోసం సుమారు రూ.3,00,000/- నుండి 8,00,000/- వరకు యాసిడ్ దాడి బాధితులకు నష్ట పరిహారం క్రింద అందిస్తామని తెలిపారు. యాసిడ్ దాడి బాధితుల ఆరోగ్యం పట్ల మెరుగైన వైద్య చికిత్సలు అందించేలా సహాయపడతాయని అని తెలిపారు.  బాధితులకు నష్టపరిహారం, మెరుగైన వైద్య చికిత్సల విషయంలో  న్యాయ సేవా సంస్థలను ఆశ్రయించి న్యాయం పొందవచ్చును అని తెలిపారు. మరియు న్యాయ సేవాధికార సంస్థల విధి, విధానాలు, ఉచిత న్యాయ సహాయం మొదలైన చట్టాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు వివిధ చట్టాలపై అవగాహన కలిగి ఉండి, మీ మీ చుట్టుపక్కల వారికి కూడా చట్టాల పట్ల జ్ఞానాన్ని పెంపొందించేలా సహాయపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యం.విజయా దేవి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: