మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ 5వ డివిజన్ ప్రధాన  రహదారులు ఇరుకుగా ఉండడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   ఈ రహదారుల వెంబడి ప్రతి రోజు నిత్యం పోలీస్ వాహనాలు *మహారత్న  ఎన్టీపీసీ కంపెనీకి సెక్యూరిటీ నిర్వహించే CISF సిబ్బంది వాహనాలతో*పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఫంక్షన్ హాల్స్ కాలేజీలకు వెళ్ళేవారు ప్రయాణం చేస్తుంటారు  రాజీవ్ రహదారి టీవీఎస్ షోరూం నుండి ఓసిపి4 రోడ్డు వరకు మరియు ఎన్టీపీసీ ఎస్బిఐ బ్యాంకు నుండి ఎన్టీపీసీ పునరావాస గ్రామం అయిన నర్రశాలపల్లి వరకు ఉన్న రహదారి ఇరుకుగా ఉన్న కారణంగా రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  ప్రస్తుతం వాహనాల రద్దీ పెరగడంతో రెండు వాహనాలు ఒకేసారి  పోవాలంటే వాహనదారులు తంటాలుపడుతున్నారు. *మహారత్న ఎన్టీపీసీ కంపెనీకి సెక్యూరిటీ నిర్వహించే CISF సిబ్బంది బస్సులు ప్రతిరోజు  వస్తూ పోతూఉంటాయి. బస్సులు ఎదురుగా వచ్చినప్పుడు మరియు పోలీస్ వాహనాలు ఎదురుగా వచ్చినప్పుడు ఇరుకు రోడ్డు కారణం గా ప్రజలు వాహనదారులు నానా తిప్పలు పడుతున్నారు. . ఈ భారీ వాహనాలు ఉన్నతాధికారుల వాహనాలు ఎదురెదురుగా వస్తే వాహనాలకు ఇబ్బంది ఏర్పడుతోం ది. రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే మరో వాహనం వెళ్లేందుకు దారే లేకుండాపోతోంది. దీంతో వెనుక వచ్చే వాహనదారులు త్రీవ ఇబ్బం దులు పడుతున్నారు. 

40 సంవత్సరాల ఎన్టీపీసీ పునరావాస గ్రామం కోసం  మరియు అప్పటి FCI కంపనీ అవసరాల కోసం నిర్మించిన  ఇరుకు రోడ్డు గుండా వెళుతున్న భారీ వాహనాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దారి నుంచే వాహనాలు వస్తూపోతూ ఉంటాయి. రహదారి ఇరుకుగా ఉన్న కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

ఈ విషయంపై రామగుండం ఎమ్మెల్యే  కోరు కంటి చందర్ కార్పొరేషన్ పాలకులు అధికారులు మరియు మహారత్న ఎన్టీపీసీ కంపనీ సామాజిక బాధ్యతగా స్పందించి శ్రీనగర్ కాలనీ టీవీఎస్ షోరూం నుండి ఓసీపీ4 రోడ్డు వరకు ఉన్న రోడ్డు విస్తరణ చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి అవసరమైన చోట బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలి మరియు ఎన్టీపీసీ ఎస్బిఐ బ్యాంకు నుండి ఎన్టీపీసీ పునరావాస గ్రామం అయిన నర్రశాలపల్లి వరకు రోడ్డు విస్తరణ చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని  కోరారు..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: