మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం, ఎల్బీనగర్, మేదర బస్తి, శామిల్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహిత, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భూషిపాక సంతోష్ మహారాజ్ ను మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య చేతులమీదుగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎక్స్ ఎమ్మెల్యే కాజీపేట లింగయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ సమాజంలో దళితులకు సేవ చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరు ప్రేమించాలని, దళిత బడుగు బలహీన వర్గాల హక్కులను కాపాడాలని, ఎస్సీల యొక్క రిజర్వేషన్ అన్యాక్రాంతం కాకుండా చూడాలని, అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని, దళిత బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్య కు ముందుండి పనిచేయాలని, భుష్పక సంతోష్ కు అంబేద్కర్ నేషనల్ అవార్డు రావడం సంతోషకరమని కాసిపేట లింగయ్య విన్నవించారు.....
ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బుషిపాక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ, నా రాజకీయ గురువు, మార్గదర్శి, దిక్సూచి, తుపాకీ తూటా మాటలతో గడగల లాడించే నాయకుడు, దళిత బిడ్డ, పెద్దపెల్లి జిల్లా మజి ఎమ్మెల్యే కాజీపేట లింగయ్య నేషనల్ అవార్డు వచ్చిన వెంటనే మొదటగా నన్ను సత్కరించడం చాలా సంతోషకరంగా ఆనందంగా ఉంది, రాబోయే రోజులలో బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం, అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల అన్యక్రాంతం కాకుండా పరిరక్షించడం కోసం, ఎల్లవేళలా ప్రజల్లో ఉంటూ దళిత బడుగు ప్రజా సమస్యల పైన పనిచేస్తానని బుషిపాక సంతోష్ అన్నారు, ఈ కార్యక్రమంలో ఇండియన్ కిషన్ యూనియన్ పెద్దపెల్లి జిల్లా చైర్మన్ కన్నూరి రమేష్ అక్కపురం రమేష్, ఏం బిక్షపతి, నరేష్, దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: