ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పోలీసు అధికారులు, నేరాల నియంత్రణ, నేరాల చేధనలో సాంకేతికతను సమర్ధవతంగా ఉపయోగించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయoలో పోలీసు అధికారులతో ఎస్పి నేర సమీక్షా సమావేశo నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ
ఫోక్సో ఎస్సీ ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని,
ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని మరియు పూర్తి పారదర్శకంగా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.
పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని, కేసుల్లో శిక్షల శాతం పెంచాలని ఎస్పి కోరారు. టార్గెట్ పెట్టుకొని పెండింగ్ ఉన్న కేసులను తగ్గించాలన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,
సీసీ కెమెరాలను ప్రతిరోజూ మానిటర్ చేయాలని, సీసి కెమెరాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యం పెంచాలని అన్నారు. విధినిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు.సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాలలో ప్రజలకు యువకులకు పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
ఈ నేర సమీక్ష సమావేశంలో కాటారం డిఎస్పి జి.రామ్మోహన్ రెడ్డి, భూపాలపల్లి, చిట్యాల, కాటారం, మహాదేవ పూర్, ఎస్బి, సిఐలు, రాజిరెడ్డి, వెంకట్, రంజిత్ రావు, కిరణ్, రాజేశ్వరరావు, జిల్లా పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు.


Post A Comment: