ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

 



హన్మకొండ ;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీలకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా  అందిస్తున్న నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గురువారం  పాలకుర్తి నియోజకవర్గం, కొడకండ్ల మండలం, మొండ్రాయి గ్రామంలోని సి.ఎస్. ఐ వెస్లీ చర్చిలో, దేవరుప్పుల మండలంలోని అక్షర గార్డెన్స్ లో పాల్గొని క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు కొత్త దుస్తులను అందించి, కేక్ కట్ చేసి, చిన్నారులకు తినిపించి, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఫాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి,  ముఖ్యమంత్రి  కేసీఆర్ కి, మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు కి శుభాశీస్సులు అందించారు.

ఈ సందర్భంగా 

మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 

క్రీస్తు ప్రభువు పుట్టిన రోజు దగ్గరకు వచ్చినందుకు పెద్ద ఎత్తున మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం.

 నెల అంతా ఈ వేడుకలు జరుపుకోవాలి.అందరికీ 

క్రిస్మస్ శుభాకాంక్షలు.

తెలంగాణ రాక ముందు, కేసిఆర్  సీఎం కాకముందు క్రిస్మస్ ఎలా జరిగింది...?ఇపుడు ఎలా జరుగుతుంది? ఆలోచించాలి.

గతంలో చర్చిలలో క్రిస్టియన్లు క్రిస్మస్ చేసుకునేవారు.

ఇపుడు ప్రభుత్వ పరంగా ఈ పండుగ చేస్తున్నారు. దేశంలో ఇలా చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. ఇపుడు ఈ వేడుకల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మార్వోలు, ఎంపిడిఓలు, సర్పంచులు, గ్రామ కార్యదర్శి వంటి అందరూ అధికారికంగా పాల్గొనాలి అని ఆదేశాలు ఇచ్చారు సీఎం కేసీఆర్ .

అన్ని మతాల వారిని ఏకతాటి మీద నడిపిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ .

అందరు దేవుళ్ళు ఒకటే.అందరూ కలిసి ఉండాలి. కొన్ని అవతారాల్లో వారు పుట్టారు.

కానీ కొన్ని పార్టీలు చిచ్చు పెడుతున్నాయి. ప్రభువు వేరు, అల్లా వేరు, హిందూ మతం వేరు, ముస్లింలు వేరు, క్రిస్టియన్లు వేరుగా చూడాలని రాజకీయం చేస్తున్నారు. అటువంటి వారిని గ్రామాలకు కూడా రానివ్వ వద్దు.

మత చిచ్చు పెట్టేందుకు కొన్ని పార్టీలు చూస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఎలాగైనా ప్రజలను మతం పేరుతో చీల్చాలని చూస్తున్నాయి.

హిందువులు, ముస్లింలకు తగాదాలు పెట్టాలని చూస్తున్నాయి.

భారత దేశంలో ఇలాంటి చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చాము. ఇక్కడ కూడా అదే విధంగా రావాలని చూస్తున్నాయి.కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవించాము. కాబట్టి అలాంటిది జరిగే ప్రసక్తి లేదు.ప్రభువు పుట్టిన రోజును ఇపుడు ప్రపంచ దేశాలు అన్ని చేసుకుంటున్నాయి.

తెలంగాణలో 8 ఏళ్లుగా చిన్న మత ఘర్షణ లేదు. గతంలో ముస్లింలు, హిందువులు కొట్టుకునేది. క్రిస్టియన్లను కించపరిచేది, వాళ్ళను వేరు చేసి రాజకీయాలు చేసేటోళ్లు ఉండేది. కాంగ్రెస్, బిజెపి చేసింది. ఈ పండగల వేళ పేదలకు ఎంతో కొంత మేలు చేయాలని బట్టలు ఇస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్. నేను కూడా ప్రభువు దీవెనలు తీసుకుని ఇంత స్థాయికి వచ్చాను.30 ఏళ్ల కింద నేను ఇజ్రాయిల్ వెళ్ళాను. ప్రభువు ఉన్న స్థలం జెరూసలేం వెళ్ళాను. అక్కడ సముద్రంలో రాయి వేసినా తేలుతుంది. అక్కడ ప్రభువు సమాధి ఉంది. అక్కడ ఏదో ఒక శక్తి ఉంది. అలాగే ప్రతి దేవునికి ఏదో ఒక శక్తి ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడకు పోయినా మనస్పూర్తిగా చేయాలి.

పాపాలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది గొప్పగా బతుకుతుంటారు. వాళ్ళు

తాత్కాలికంగా పైకి వస్తారు. కానీ డమ్మున కింద పడుతారు. మనం మంచి చేస్తే మనకు కాకపోయినా మన పిల్లలకు ఉపయోగపడుతుంది. మన దగ్గర డబ్బులు లేకపోయినా మన దగ్గరకు వచ్చిన వారికి ధైర్యం చెప్పాలి. నాకెందుకు అని వదిలి వేయొద్దు.

గతంలో చర్చిలకు నిధులు ఇచ్చే అధికారం మాకు లేకుండే. కానీ సీఎం కేసీఆర్  చర్చిలు, మసీదులు, గుళ్ళకు కూడా ఖర్చు చేసే అవకాశం ఇచ్చారు.మీకు చర్చిలకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. చేస్తాం అన్నారు. 

ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఎంపీపీ శ్రీమతి జ్యోతి రవీందర్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రేరం రాము, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, సర్పంచ్ ఊర్మిళ సోమయ్య, ఫాస్టర్లు థామస్, పురుషోత్తం, ప్రసన్న పాల్, సాల్మన్, డిఆర్డిఓ పి.డి శ్రీరామ్ రెడ్డి, దేవరుప్పుల ఎంపీపీ సావిత్రి, సర్పంచ్ రామ, వైస్ ఎంపీపీ విజయ, ఫాష్టర్లు ఎసురత్నం ఆశీర్వాదం, మత్తయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: