ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
గ్రేటర్ వరంగల్ కు చెందిన మార్బుల్, పాలిష్ మేస్త్రి లు, కార్మికులు పాలిష్ మార్బుల్ గ్రానైట్, స్టోన్ టైల్స్ పాలిష్ మిషన్ ఫ్లోరింగ్ వర్కర్స్ యూనియన్ - గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో బి. ఆర్. ఎస్. కే. వి జిల్లా నాయకులు మర్రి శ్రీనివాస్ అధ్యక్షతన రాజశ్రీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశం లో బి.ఆర్. ఎస్. కే. వి లో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు.
అంతకు ముందు బి. ఆర్. ఎస్. కే. వి ఆధ్వర్యంలో మర్రి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన కార్మికుల హాక్కులపై అవగాహన కార్యక్రమం లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, లేబర్ ఆఫీసర్ లుప్రసాద్, శ్రీధర్ బాబు, వినోద్ కుమార్, బి. ఆర్. ఎస్. కే. వి జిల్లా అధ్యక్షులు బోగి సురేష్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 52 రకాల భవన నిర్మాణ కార్మికులకోసం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. లేబర్ కార్డు ద్వారా ప్రమాద భీమా సౌకర్యం కల్పించబడుతుంది. పిల్లలు కలిగితే ఆర్ధిక సహకారం, కార్మికులు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తే సహకారం చేస్తున్నారు, ఈ శ్రమ్ కార్డు లో అన్ని రకాల అసంఘటిత కార్మికులకు వర్తిస్తాయి, కార్మిక నాయకుల సహకారం తో ముందుకు వెళ్ళండి, కార్మికులకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటామన్నారు.
కార్మికుల సంక్షేమం కోసమున్నదే కెసిఆర్ నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,
దాదాపు 50 సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నా, కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తా, చేస్తున్న,
నేను కార్మికుడి బిడ్డనే,కార్మిక సోదరులను కంటికి రెప్పలా కాపాడుకుంటా,సోదరుడిలా అందుబాటులో ఉంటా.
కార్మిక సంఘ నాయకుల పేరుతో కార్మికులను బెదిరిస్తే సహించేది లేదు. వృత్తి రిత్యా నా తండ్రి లారీ డ్రైవర్, ప్రమాదవషాత్తు ఆక్సిడెంట్ లో చనిపోయారు. చాలా ఇబ్బంది పడ్డం అప్పుడు చిన్న సహాయం అందింది. కానీ ప్రస్తుతం కెసిఆర్ సర్కార్ 5 లక్షలు సహాయం చేస్తూ ఇంటికి అండగా ఉంటున్నది. అంగవైకల్యం అయితే వాహనం,3 నెలలు సహాయం అందిస్తుంది. ఇంటి పెద్ద మరణిస్తే వివిధ పనుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తుంది, అందుకే మార్బుల్, టైల్స్ కార్మికులకు స్వంతం గా లేబర్ కార్డు, సభ్యత్వం లు చేర్పిస్తా,అండగా ఉంటా,
వరంగల్ లోని అన్ని రకాల కార్మికులను ఐక్యం చేసి కార్మిక శక్తి గా చేస్తా, ప్రజలు, కార్మికుల సంక్షేమం కోసం విద్యా,వైద్య రంగాలలో వరంగల్ ను అభివృద్ధి చేసుకుంటున్నాం, అని అన్నారు. ఈ కార్యక్రమం లో బి.ఆర్.ఎస్.కే.వి జిల్లా నాయకులు దుబ్బ శ్రీనివాస్, మార్బుల్, టైల్స్ మేస్త్రి ల యూనియన్ నాయకులు మహమ్మద్ , జన్ను నరేష్,తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: