ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రామన్న పేట లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. ఆలయ చైర్మన్ గా అప్పారాజు చంద్రమోహన్ (రాజు ),ధర్మకర్త లు చిట్టీమల్ల సురేష్, గంగిశెట్టి హరినాథ్, పప్పుల మంజుల, బిట్ల శేఖర్, కటకం రాములు మరియు ఎక్స్ ఆఫీసియో టి. రత్నాకర్ లను దేవాదాయ, ధర్మాదాయ శాఖ జి.సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పోరేటర్ గందె కల్పన -నవీన్, దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఎన్. వెంకట్రావు, కొలిపాక శ్రీనాథ్, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ టీ.రమేష్ బాబు, మర్రి రవి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: