పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:రామగుండం:డిసెంబర్:21:రామగుండం ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవనికి ముఖ్య అతిధిగా రామగుండం ఎం.ఎల్.ఏ.కోరుకంటి చందర్ రామగుండం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ని హట్టహాసంగా ప్రారంభించడం జరిగింది.రామగుండం లోని స్థానిక అయోధ్య నగర్ లో బుధవారం ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ తో రామగుండం ప్రెస్ క్లబ్ ని ఘనంగా ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి 37వ డివిజన్ కార్పొరేటర్ మరియు తెలంగాణా జాగృతి జిల్లా అధ్యక్షులు పెంట రాజేష్,డి.సి.సి.అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,అంతర్గాం జడ్పిటిసి ఆముల సత్యనారాయణ, ఏ.సి.పి. గిరిప్రసాద్,ఎన్.టి.పి.సి.-సి.ఐ. చంద్రశేఖర్,బి.ఎం.ఎస్. నాయకులు యాదగిరి సత్తయ్య, పట్టణ బి.ఆర్.ఎస్.పార్టీ అధ్యక్షులు బొడ్డుపెల్లి శ్రీనివాస్ అతిధిలుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎం.ఎల్.ఏ.కోరుకంటి చందర్ మాట్లాడారు నవ సమాజ నిర్మాణం కోసం పాత్రికేయులు తమ జీవితాలను సైతం త్యాగం చేస్తున్నారని,తెలంగాణ ఉద్యమంలో వీరి కృషి ఎంతో కీలకమైన దని,ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తూ,ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కర దిశగా ఎప్పటికప్పుడు కృషి చేస్తుంది పత్రికరంగమే అని అన్నారు.సమాజ మార్పు, ప్రజలను చైతన్య పరచడంలో పాత్రికేయులు ఎంతో కీల పాత్ర పోషిస్తున్నారని,తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వీరు పాలుపంచుకుంటున్నారు అనడంలో అతిశయోక్తి లేదన్నారు. రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్.కె.జమీల్,ఉపాధ్యక్షులు కొండ్ర అంజయ్య యాదవ్,ప్రదాన కార్యదర్శి పర్కాల లక్మినారాయన గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ అనిల్ కుమార్, కోశాధికారి రవీందర్,జాయింట్ సెక్రటరీ జలీల్ మరియు కార్యవర్గ సభ్యులు మధు,వెన్నెల శ్రీను,నవీన్,సతీష్,రాజేష్ యాదవ్,స్వామి,రఫిక్,బి.శ్రీనివాస్,తాజాద్దీన్,సాగర్,మహేష్ తదితరులందరిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: