మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండలంలోని
అంబట్ పల్లి,కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ బుధవారం రోజు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లు ఎంపీపీ రాణి బాయ్ రామారావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ,తెలంగాణలో చాలా మంది గర్భిణీ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని,
గర్భంలో బిడ్డ పెరుగుతున్న సమయంలో గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలని,దీని వల్ల గర్భంలోని శిశువులు ఆరోగ్యకరంగా పెరుగుతారు.
కానీ చాలా మారుమూల గ్రామాల్లోని మహిళలకు పౌష్టికాహారం లభించడం లేదని ప్రభుత్వం తన సర్వేలో గుర్తించిందని,ఒక్క కొమురంభీం జిల్లాలో 83శాతం గర్బిణులు, రక్తహీనతతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారని,
ఈ రక్తహీనత కారణంగా ప్రసవ సమయంలో రక్తం తక్కువగా ఉండి తల్లీ, బిడ్డలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందనీ, రక్తహీనతను నివారించటం ద్వారా మాతృ మరణాలను తగ్గించవచ్చునని అనేక అధ్యయనాలు చెబుతున్నాయని.అందులో భాగంగా గర్భిణులు, గర్భంలోని శిశువు రక్షణ కోసం,ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిందని,
ఈ పోషకాహార కిట్ వల్ల గర్భిణులకు విటమిన్లు, మినరల్స్,ప్రొటీన్లు అందుతాయని అన్నారు.
మాత శిశు సంరక్షణ కోసం, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది.తాజాగా న్యూట్రిషన్ కిట్ల పంపిణీ పథకాన్ని తీసుక వచ్చిందని.
ప్రస్తుతానికి మాతృ మరణాల సంఖ్యను తగ్గించడంలో తెలంగాణ రాష్ట్రం,దేశంలోనే మూడో స్థానంలో ఉందనీ,
ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పథకాన్ని ప్రారంభిస్తోందని అన్నారు.న్యూట్రిషన్ కిట్ల ద్వారా గ్రామీణ పేద గర్భిణులకు లబ్ధి చేకురనుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు జయశ్రీ,మమత,సర్పంచ్ లు విలాస్ రావు,వసంత,డాక్టర్ ప్రమోద్ కుమార్,డాక్టర్ రాజు,వైద్య సిబ్బంది,గర్భిణీ లు పాల్గొన్నారు.


Post A Comment: