చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నారైతుల బతుకులు మారలేదని,
రైతుల పక్షాన సైనికుల్లా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని రైతూ
హక్కుల సాధన సమితి చౌటుప్పల్ పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన అరిగే వీరస్వామి అన్నారు. గురువారం తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి
సప్పిడి లింగారెడ్డి బందరపు రాజుగౌడ్, చేతుల మీదుగా నియా మక పత్రం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అరిగే వీరస్వామి మాట్లాడుతూ తనను చౌటుప్పల్ పట్టణ రైతు సమస్యల
సాధన సమితి అధ్యక్షుడిగా ఎన్నికకు సహకరించిన సభ్యులంద రికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజులలో రైతుల
సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని పార్టీలకతీతంగా రైతులను ఏకతాటిపై నిలిపి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన
ని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షుడు బందరపు రాజుగౌడ్, ఎస్ లింగోటం గ్రామ శాఖ అధ్యక్షుడు కుర్రాల వెంకటేష్, పాల్గొన్నారు

Post A Comment: