మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండల ప్రజా పరిషత్ కార్యాలయం మహాదేవపూర్ లో ఈరోజు రాణిబాయి రామారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించబడినది.ఇట్టి సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ మహదేవపూర్ మండలంలో ఎనకపల్లి,పెద్దంపేట,అంబటి పల్లి,అన్నారం,ఎడపల్లి, చండ్రుపల్లి గ్రామ పంచాయతీలకు భవనాలు లేనందున,నూతనంగా గ్రామపంచాయతీ భవన నిర్మాణం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల క్రింద నిర్మాణం చేపట్టుకొనుటకు, ఒక్కొక్క గ్రామపంచాయతీ భవనానికి 20 లక్షల చొప్పున నిధులు మంజూరి అయినట్లు తెలుపుతూ,అట్టి గ్రామపంచాయతీలలో గ్రామపంచాయతీ భవన నిర్మాణం చేయుటకు అవసరమైన స్థలము సంబంధించి,ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉన్నది.ప్రభుత్వ భూమి లేనిచో ఎవరైనా దాతలు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా,వివరములను ఈ కార్యాలయమునకు గ్రామపంచాయతీ తీర్మానం ద్వారా అందజేయుటకు తెలిపినారు.ఇట్టి తీర్మానం ప్రతులు గ్రామపంచాయతీ నుండి అందిన వెంటనే అసిస్టెంట్ ఇంజనీర్ పంచాయతీ రాజ్ శాఖ అంచనాలు రూపొందించి, పరిపాలన ఆమోదం గైకొని పనులు ప్రారంభం అయ్యేటట్లుగా సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రేపు ఉదయం అన్ని గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉన్న స్థల వివరాలను సర్వే నిర్వహించాలని,ఎక్కడైతే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందో,అట్టి స్థలం యొక్క సర్వే నెంబరు, అందుబాటులో ఉన్న భూ విస్తీర్ణం వంటి వివరాలతో గ్రామపంచాయతీ తీర్మానము చేసి,అట్టి ప్రతిని కూడా తాసిల్దార్ కి భూమి కేటాయింపు నిమిత్తం అందజేయాలని కోరినారు. ఇట్టి సమావేశంలో జడ్పిటిసి గుడాల అరుణ,ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతయ్య, ఎంపీటీసీ లు దుర్గయ్య, సుధాకర్,సత్య,సురేందర్, మల్లయ్య,ఎంపీడీవో శంకర్, తహసిల్దార్ శ్రీనివాస్,ఎంపీఓ ప్రసాద్,అసిస్టెంట్ ఇంజనీర్ రవీందర్,ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు,ఎంపీటీసీలు , తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: