ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా గణపురం పోలీస్ స్టేషన్ ను సందర్శించి, పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పిఎస్ లో నిర్వహించే జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్ ఇండెక్స్ రికార్డులను పరిశీలించారు. ప్రజలకు సిబ్బంది అందిస్తున్న సేవలపై పోలీస్ స్టేషన్ నిర్వహణ సమస్యల గురించి, ఎస్సైని అడిగారు. ఈ సందర్భంగా ఎస్పీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సిబ్బంది అందరూ నూతన సాంకేతిక పరిజ్ఞానంపై తప్పక అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, పాత నేరగాళ్లపై నిఘా పెట్టాలని, పోలీసులు ఎవరి వర్టికల్లో (విభాగం) వారు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, సిబ్బందికి సూచించారు. పోలీసులు తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, మహిళా భద్రత గురించి అవగాహన కల్పించాలని, బ్లూ కొల్ట్, పెట్రో కార్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణ తక్షణమే స్పందించి, సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. దొంగతనాలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని బాధితుల సమస్యలను సావధానంగా వినాలని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్లో ఉండకుండా పనిచేయాలని, ఎస్ఐ అభినవ్ కు ఎస్పి సూచించారు. ఈ పీఎస్ తనిఖీ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు, చిట్యాల సిఐ పులి వెంకట్, సిసి ఫసియుద్దీన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: