ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణ రాష్ట్రన్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాలనుసారము, "ఇంటర్నేషనల్ జస్టీస్ మిషన్" వారి సహకారంతో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, వరంగల్ కార్యదర్శి జె.ఉపేందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన పారా లీగల్ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమము న్యాయ సేవ సదన్ బిల్డింగ్ లో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్-కం-వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.రాధాదేవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.రాధాదేవి మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు న్యాయ సేవాధికార సంస్థలకు వారధిగా నడుచుకోవాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ జస్టీస్ మిషన్ మరియు ఫౌండేషన్ ఫర్ సస్టేనబుల్ డెవలప్మెంట్ వారు అందించిన విషయాలను, చట్టాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని, ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థల విధులను, లక్ష్యాలను ప్రజలకు తెలియజెప్పి, ఏ పౌరుడూ న్యాయాన్ని కోల్పోకుండా పారా లీగల్ వాలంటీర్లు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో హ్యూమన్ ట్రాఫికింగ్, బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ (బి.ఎల్.ఎస్.ఏ.), చైల్డ్ అండ్ అడాల్సెంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ ఆక్ట్ మరియు న్యాయ సేవా సంస్థ యొక్క విధులు, లక్ష్యాలు, ఉచిత న్యాయ సహాయం, నాల్సా స్కీమ్ ల గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జే.ఉపేందర్ రావు, ఐజేయం టీం సభ్యులు, వి.జయరాజ్ (న్యాయవాది, ఎఫ్.ఎస్.డీ.), యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ స్టూడెంట్స్, ఆదర్శ లా కాలేజ్ స్టూడెంట్స్, ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


Post A Comment: