ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి పోలీసు స్టేషను భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి గురువారం
తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్లో వర్టీకల్స్ వారిగా అధికారులు మరియు సిబ్బంది పనితీరును పరిశీలించారు. పీఎస్ లోని పలు రికార్డులను పరిశీలించిన ఎస్పి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, విధుల పట్ల నిబద్ధత, సమయస్ఫూర్తి కలిగి ఉండాలని సూచించారు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో మర్యాదగా నడుచుకుంటూ, వారికి న్యాయం కల్పిస్తామనే భరోసా కలిగించాలని సూచించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, నీతి, నిజాయితీతో విధులు నిర్వహించే వారికి ఎల్లప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. అలాగే రౌడీ షీటర్లు హిస్టరీ సీటర్లు బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న వారి వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలని ఎస్సై శ్రీధర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి ఏ. రాములు, చిట్యాల సిఐ పులి వెంకట్, సీసీ ఫసియుద్దిన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: