ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగులశ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వ చీఫ్   వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు ప్రభుత్వ చీఫ్  విప్ జిల్లా కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలసి   క్రిస్మస్ వేడుకల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా చీఫ్  విప్ మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారన్నారు. ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. క్రిస్మస్ ను పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లు (దుస్తులు) పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. క్రిస్మస్ పండుగా సందర్బంగా ప్రభుత్వం రెండు వేల మంది నిరుపేద క్రైస్తవులకు దుస్తుల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ కార్యక్రమాని ఉత్సవ కమిటి ,స్థానిక తహసీల్ధార్‌లు పరిశీలించి అర్హులైన నిరుపేద క్రైస్తవులను ఎంపిక చేసి  పంపిణి చేయడం  జరిగింది అని అన్నారు.   ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరుకావాలన్నారు. ఈ వేడుకలను  కమిటి సభ్యులు స్వచ్చందగా పాల్గొని వేడుకల వేదికను అందంగా ముస్తాబు చేసుకొవాలని అన్నారు. ప్రభుత్వం ప్రతి నియోజిక వర్గనికి రూ 2.లక్షలు నిధులను కేటాయించిదని వీటిని క్రీస్మస్ సోదరులు సద్వినియోగ పరుచుకొవాలని కోరారు.

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన మేరకు క్రిస్మస్ వేడకలు నిర్వహిస్తామని తెలిపారు.

చీఫ్  విప్   కేక్ కట్ చేసి   పాస్టర్ లకు  అందజేశారు. శుభాకాంక్షలు తెలిపారు. 

క్రిస్టియన్లకు ప్రాధాన్యం కల్పించి ప్రభుత్వం తరపున క్రిస్మస్‌ వేడుకలను నిర్వహించడం పట్ల పలువురు క్రైస్తవ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ  కార్యక్రమం లో అదనపు  కలెక్టర్ సంధ్యా రాణి, డిఆర్ఓ  వాసు చంద్ర, పరకాల ఆర్డీఓ  రాము, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి  శ్రీనివాస్, రెవిన్యూ, మున్సిపల్,అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: