ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

మనఊరు-మనబడి పథకంలో భాగంగా చేపట్టిన పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని,  జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అదనపు  కలెక్టర్ సంధ్యా  రాణి తో కలసిమన ఊరు-మన బడి’ పథకం కింద  కేటాయించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో, ఎస్‌ఎంసీ చైర్మన్లు, ఎంఈవో, ఎంపీడీవో, ఏపీవో, ఇంజనీరింగ్‌ విభాగం ఏఈ, డీఈవో లతో  సమీక్షా  సమావేశం నిర్వహించారు.

ఈ  సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..‘మన ఊరు-మన బడి’ పనులను  ప్రతి పాఠశాలలో జరుగుతున్న పనులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పర్యవేక్షించి వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. చిన్నచిన్న అడ్డంకులు ఎదురైనా అధికారులు సమన్వయంతోపరిష్కరించుకోవాలన్నారు. పాఠశాలల పనులు పూర్తిచేసేలా స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పాఠశాలల్లో కొత్తగా లైబ్రరీ రూం ఏర్పాటు చేయాలి  అని అన్నారు. అధికారులను ఆదేశించారు. కొన్నేళ్లుగా ఎలాంటి సదుపాయాలకు నోచుకోని ప్రభుత్వ పాఠశాలలను బాగుచేయడానికి తీసుకొచ్చిన గొప్ప పథకం మన ఊరు - మన బడి అని అన్నారు. ఈజీఎస్‌ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్‌ షెడ్‌ నిర్మాణం పూర్తి చేశాకే మిగతా ప్రహరీ, అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఎంపీడీవో, ఎంపీవోలు రోజువారీగా పాఠశాలల్లో జరుగుతున్న ఈజీఎస్‌ పనులను పర్యవేక్షించాలన్నారు. సెంట్రల్ పూలింగ్ విధానం ద్వారా ఇక పై  చెల్లింపులు జరుగుతాయని, మొదట పనులు పూర్తి చేసి, ఎఫ్.టి.ఓ లు జనరెట్ చేసిన వారికి నిధులు ముందస్తుగా విడుదలవుతాయని, కావున  పనులు సత్వరమే  పూర్తిగా చేయాలనీ  అన్నారు.  పాఠశాలలో ఉన్న పాత ఫర్నిచర్ ను తొలగించాలని,  బీరువాలకు స్ప్రే పెయింటింగ్ వేయాలని, పాడయిపోయిన ఫర్నీచర్ ను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కండేం చేయాలని అన్నారు. పాఠశాలలో  పనుల ఇంజనీరింగ్ అధికారులు నాణ్యత విషయంలో పకడ్బందీగా ఉండాలని  తెలిపారు. పాఠశాల లో పెయింటింగ్ పనులు పూర్తి చేయాలి అని అన్నారు. జిఎస్టీ  సమస్యలను ఉన్నత అధికారులు దృష్టి కీ తీసుకొని వస్తామని అన్నారు.

అదనపు  కలెక్టర్ సంధ్యా రాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆలోచన నుంచి వచ్చిన ప్రతిష్టాత్మకమైన మన ఊరు మనబడి కార్యక్రమం అని అన్నారు. పాఠశాలలలో నాణ్యత మైన పనులు చేపట్టి క్రీడా ప్రాంగణం తో పాటు పాఠశాలను అన్ని సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలల పరిశుభ్రత గ్రామపంచాయతీ బాధ్యత తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. పనులు పూర్తయిన వాటి బిల్లులు మంజూరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ  కార్యక్రమం లో పిడి డిఆర్డిఏ శ్రీనివాస్ కుమార్ డిఈఓ  అహ్మద్, స్పెషల్ ఆఫీసర్లు, విద్యా శాఖ  అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: