ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, కైలాష్ సత్యర్థి ఈనెల 18,19 తేదీలలో హనుమకొండ పట్టణం లో పర్యటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బీ. వినోద్ కుమార్ తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ
చిన్నారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటుంది అని అన్నారు. నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్థి జిల్లా పర్యటన విజయవంతం చేయాలి అని అన్నారు. స్కూల్ విద్యార్థులకు బాలకార్మిక వ్యవస్థ, హక్కులపై ఈ కార్యక్రమం ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమం లో చిన్నారులకు ఇటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి అని అన్నారు.
ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ బాలల హక్కులు సంరక్షణ ప్రతి ఒక్కరి విధి అన్నారు. బాలల హక్కుల రక్షణ కు ప్రభుత్వం దేశానికి ఆదర్శ అన్నారు. తను వ్యక్తి గతంగా కైలాష్ సత్యర్థి ని కలిసి జిల్లా కు రావాల్సిందిగా కోరడమైనదన్నారు. ఈనెల 18 వ తేదీ న కైలాష్ సత్యర్థి ఆదాలత్ కోర్టు లోగల పోక్సో కోర్ట్ ను సందర్శిస్తారని,19 వ తేదీ చిన్నారుల తో క లసి పాలు కార్యక్రమాలలో పాల్గొంటారని అన్నారు.ఈ కార్యక్రమం విజయవంతం నకి అధికారులు సమన్వయము తో పని చేయాలి అని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ బండ ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
సీపీ రంగనాథ్, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపీ, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఇ ఓ లు అహమ్మద్, వాశాంతి కైలాష్ ఫౌండేషన్ ప్రతినిధి చందన, మున్సిపల్, విద్యా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: