ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ వరంగల్ సాధ్యమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్   అభిప్రాయపడ్డారు.

గురువారం హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ లోగల పద్మశ్రీ డా. నేరెళ్ళ వేణుమాధవ్ ఆడిటోరియంలో మహానగరపాలక సంస్థ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ), భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ ( మారి ) సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  స్వచ్ఛ వరంగల్ పౌర సంఘాల వేదిక అవగాహన కార్యక్రమానికి  నగర మేయర్ గుండు సుధారాణి తో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ  ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం ఉత్తర్వులు తీసుకొచ్చినప్పటికిని ప్రజా భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతాయని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో కార్పొరేటర్లకు ఆస్కీ ఆధ్వర్యంలో సానిటేషన్ సంబంధ అంశాలపై శిక్షణ ఇప్పించారని, 2010  అక్టోబర్ 2 నుండి ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి  కృషి చేస్తున్నానని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో నగరానికి 62వ ర్యాంకు రావడం జరిగిందని తద్వారా కార్పొరేషన్ కు రూ. 6 లక్షల అవార్డు కూడా దక్కిందని, ఉమ్మడి రాష్ట్రంలో  శాసనసభ్యుడిగా తాను అసెంబ్లీ అవరణ లో  ప్లాస్టిక్  నిషేధానికి చొరవ చూపించడం  జరిగిందని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో అన్ని వర్గాల ప్రజలు  నివసించడం జరుగుతుందని అందరి  ఆలోచనలకు అనుగుణంగా వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని, ప్రజలు తమ హక్కులతో పాటు బాధ్యతను కూడా సమం గా తీసుకోవాలని, నగర పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి  ప్రభుత్వపరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, కాలనీ వాసులు  వాటిని పరిరక్షించుకోవాలని,  తన నియోజకవర్గ పరిధిలో  ఖాళీ ప్రాంతాన్ని గుర్తించి  రీసైక్లింగ్ మెటీరియల్ తో పార్క్ ఏర్పాటు కు చర్యలు చేపడతామని అన్నారు.

నగర మేయర్  శ్రీమతి గుండు సుధారాణి మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్  ఆలోచన మేరకు నగరాన్ని ఫ్యూచర్ సిటీగా మార్చాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని, బల్దియా  వ్యాప్తంగా 66 డివిజన్లతో పాటు 42 విలీన గ్రామాలు ఉన్నాయని  గతంలో పోలిస్తే నగర పరిధి విస్తృతం అయిందని, అందుకు అనుగుణంగా సానిటేషన్ విధానాలు అవసరం  అనే సంకల్పంతో ప్రభుత్వం పురపాలక చట్టం-2019 లో ప్రతి 3సం.లకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్ ను తప్పకుండా క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని సూచించడం జరిగిన నేపథ్యంలో నగరాన్ని క్లీన్ సిటీ గా,  గ్రీన్ సిటీగా  మార్చాల్సిన అవసరాన్ని  దృష్టిలో  వుంచుకొని దేశం లోనే తొలిసారి గా అమ్మవారిపేటలో ఇప్పటికే ఎఫ్ ఎస్ టి పి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, నగర అవసరాలకు అనుగుణంగా మరో 150 కేఎల్డి సామర్థ్యంతో మరో ఎఫ్ ఎస్ టి పి నిర్మాణం చేపడుతున్నామని ఈ సందర్భంగా మేయర్ తెలిపారు.

అనంతరం  ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది,పౌర సంఘాల వేదిక సభ్యులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ  కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా

 ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో చీఫ్ విప్,మేయర్ సంతకాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆస్కీ  డైరెక్టర్ ప్రొ. శ్రీనివాస చారి, మారి సంస్థ అధ్యక్షులు మురళి, వల్లంపట్ల నాగేశ్వరరావు, సుధాకర్ పుల్లూరి, రతన్ సింగ్ పురుషోత్తం, పరికిపండ్ల వేణుగోపాల్, అనితారెడ్డి కేశవరెడ్డి, ప్రో. వెంకటేశ్వర్లు, ఆస్కి పిఎంయూ రాజ్ మోహన్ డా. స్నేహలత, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: