మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండల కేంద్రంలో ప్రపంచ మృత్తిక(నేల)దినోత్సవంను పురస్కరించుకొని,ఈరోజు మహాదేవపూర్ క్లస్టర్ పరిధిలోని రైతులకు నేలల ఆరోగ్యం గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ముల్కల ప్రభావతి మాట్లాడుతూ నేలల ప్రాముఖ్యత,కాలుష్యం, జీవన ఎరువులైన పిఎస్బి ల వాడకం,వాటి ప్రాముఖ్యత, పచ్చి రొట్ట ఎరువులను సాగు చేసే విధానం,వచ్చే లాభాలు, మట్టి నమూనాలు సేకరించే విధానం,మట్టి పరీక్షల అవశ్యకత,భూసార పరీక్షా ఫలితాల విశ్లేషణ,జీవ రసాయనాల ద్వారా పురుగులు,తెగుళ్ళ నివారణ కోసం ట్రైకోడర్మా విరిడి, సుడోమొనస్ వాడకం, ఉపయోగాలు,కొయ్యకాళ్ల వరిగడ్డిని కాల్చడం వల్ల కలిగే నష్టాలు,విచక్షణ రహితంగా ఎరువులు,పురుగు మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రాణిభాయి జెడ్పిటిసి అరుణ, గ్రామ సర్పంచ్ శ్రీపతి బాపు, పిఏసిఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారి ధర్మేందర్, రైతు బంధు సమన్వయ సమితి సభ్యులు,రైతులు పాల్గొన్నారు.
Post A Comment: