ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హరితహారం లో భాగంగా నర్సరీ లలో విస్తృతంగా మొక్కల పెంపకంను చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ సంధ్యా రాణి తో కలసి భీమారం, హసన్ పర్తి లో రేషన్ షాపు లు, నాగారం సుదనపల్లి నర్సరీలు తనిఖీ లు చేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ
గ్రామపంచాయతీల్లో ప్రభుత్వ లక్ష్యం మేరకు మొక్కలను పెంచలని అన్నారు.జూన్ నెల వరకు మొక్కలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. మొక్కలు కొనకుండా పూర్తిగా నర్సరీ లోనే పెంచాలని, వృధా ఖర్చు లు తగ్గించాలి అని అన్నారు. నర్సరీలో 20 నుండి40 వేలకు తగ్గకుండా మొక్కలను పెంచాలని అన్నారు. సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది మొక్కలను వేసవిలో ఎండిపోకుండా గ్రీన్ నెట్లతో ఉదయం, సాయంత్రం వేళల్లో కూలీలతో నీటిని పోస్తూ కాపాడాలి అని అన్నారు. పంచాయతీల్లో రైతులకు అవసరమైన టేకుమొక్కలు, ఇంటి అవసరాలకు అవసరమైన పూలు, క్రోటన్స్, పండ్ల మొక్కలను ఇంటింటికి పంచేందుకు సిద్ధం చేసుకోవాలి అని అన్నారు. వివిధ నర్సరీల్లో మొక్కల పెంపకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ ను పరిశీలించారు. నర్సరీల్లోని మొక్కలు, రోడ్లు, వీధులకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. రేషన్ దుకాణంలో నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ విధానం, ఐరిష్, మాస్టర్స్ స్టాకు సంబంధిత వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల పౌర సేవల చార్ట్ పరిశీలించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు పంపిణి చేయాలన్నారు. ప్రజలకు అందించే సేవలలో ఎలాంటి అంతరాయం కలగకూడదని అన్నారు.
ఈ కార్యక్రమం లో డిఆర్డిఓ పిడి శ్రీనివాస్,డిసిఎస్ ఓ వసంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: