ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
భవన నిర్మాణరంగ కార్మికుల పలు సమస్యలను పరిష్కారం చేయాలని తెలంగాణ భవన నిర్మాణ రంగం కార్మిక సంఘం (TBNRKS) ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్,వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కార్మిక శాఖ మాత్యులు చామకూర మల్లారెడ్డిని తన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. తన నియోజకవర్గ పరిధిలో భవన నిర్మాణ రంగ కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారని దయచేసి వారి పలు సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని మల్లారెడ్డిని చీఫ్ విప్ కోరారు. ఆయన స్పందిస్తూ తప్పకుండా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం నాయకులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని చీఫ్ విప్ తో కలిసి మంత్రికి అందజేశారు.
మా న్యాయమైన కోరికలు
భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించడానికి భవన నిర్మాణ కార్మిక సంఘం ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తున్నామని కార్మిక సంఘం నాయకులు తెలిపారు. భవన నిర్మాణంలో భాగంగా భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రమాద బీమాను రూ. 10 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. భువన నిర్మాణంలో భాగంగా కార్మికుడికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా చెల్లించడంతోపాటు కార్మికుడు కోలుకునే వరకు ప్రతినెల రూ.5,000 కార్మికునికి ఇవ్వాలని కోరుచున్నాము. భవన నిర్మాణ కార్మికులందరికీ ఈఎస్ఐ హాస్పిటల్ వైద్య సదుపాయాలు అందించాలని డిమాండ్ చేస్తున్నాము.
భవన నిర్మాణ కార్మికునికి 60 సంవత్సరాల తర్వాత పనిచేయలేడు గనుక సంక్షేమ బోర్డు జారీ చేయబడిన కార్డు ఉన్నట్లయితే అట్టి కార్మికునికి నెలకు రూ. 5000 పెన్షన్ చెల్లించాలని కోరుతున్నాము.
5. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో 5% సీట్లు కేటాయించాలని కోరుచున్నాము.
భవన నిర్మాణ కార్మికుల పిల్లలు విదేశాలలో చదువుకోవడానికి వెళ్లే వారికి స్కాలర్ షిప్ లు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా ఇవ్వవలసిందిగా కోరనైనది.
ఇంతకుముందు హామీ ఇచ్చిన విధంగా భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర రాజధానితో పాటు ప్రతి జిల్లాలో మరియు మండలాలలో భవన నిర్మాణానికి 0.10 గుంటల స్థలము భవనము కట్టుకొనుటకు ఆర్థిక సహాయము చేయవలసిందిగా మనవి చేయుచున్నాము.
ప్రతి లేబర్ అడ్డ మీద కార్మికులకు వర్షాలు ఎండల వలన ఇబ్బందులు పడుతూనే రోడ్డుమీద నిలబడడం జరుగుతుంది కనుక ప్రతి లేబర్ అడ్డా మీద ఒక షెల్టర్ (లెట్రిన్ బాత్రూంలో) సహా ఏర్పాటు చేయవలెను.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ నెక్ ద్వారా శిక్షణ ఇచ్చి కార్మికులకు సర్టిఫికెట్ జారీ చేసి ప్రభుత్వము చేపట్టే అభివృద్ధి పనులలో రూ.50 లక్షల వరకు ఎలాంటి ఇ.యం.డి లేకుండా పనులు ఇవ్వాలి మరియు మున్సిపాలిటీలో జారీ చేసే బిల్డర్ లైసెన్సులు ఇలాంటి రుసుము లేకుండా ఇవ్వాలి. దీనివల్ల ఎంతోమంది కార్మికులు ఆత్మగౌరవంతో జీవిస్తారని ప్రభుత్వాన్ని కోరుచున్నాము.
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు భవన నిర్మాణ కార్మికుడిని చైర్మన్ మరియు డైరెక్టర్లని కూడా భవన నిర్మాణ కార్మికులను నియమించడం వలన భవన నిర్మాణ కార్మికుల నిజమైన కష్టాలు తెలుస్తాయి.
భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు చెస్ ద్వారా ఇచ్చే డబ్బులు మొత్తం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమము కోరకు మాత్రమే వినియోగించవలెను మరే ఇతర కార్మికులకు వినియోగించరాదు.
ఇల్లు లేని భవన నిర్మాణ కార్మికులను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వవలెను.ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో టిబిఎన్ ఆర్ కేఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంజాల మల్లేశం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేలు సారంగపాని,
ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి పాలడుగుల శివకుమార్,హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎం.డి సాధిక్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: