మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండల కేంద్రంలోని టస్సర్ కాలనీలో ఈరోజు చేనేత కార్మికుల కమ్యూనిటీ హాల్ లో మండల అధ్యక్షురాలు రాణి బాయ్ అధ్యక్షతన, నాబార్డ్ సహకారంతో,చేనేత కార్మికులకు పట్టు చీరల తయారీపై రసాయన పదార్థాలు వినియోగించకుండా, సేంద్రీయ పద్ధతులు వినియోగించి చీరలకు రంగులు అద్దడం పై చేనేత కార్మికులకు శిక్షణ ఇవ్వడం జరిగింది.ఇట్టి శిక్షణ కార్యక్రమమునకు భూపాల్ పల్లి జిల్లా,అదనపు కలెక్టర్ దివాకర ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిది లక్షల రూపాయలతో రెండు గదులను నిర్మించుటకు, చేనేత కార్మికుల మిషనరీలను అమర్చుటకు మంజూరు జరిగినందున, ఈరోజు భూమి పూజ చేయడం జరిగిందని తెలుపుతూ,చేనేత కార్మికులు పట్టు వస్త్రాల తయారీ,సేంద్రియ రంగుల అద్దకం పై శిక్షణ గైకొని, మార్కెటింగ్లో మెలకువలు నేర్చుకొని సుస్థిరమైన ఆదాయమునకు బాటలు వేసుకోవాలని కోరినారు. ఇట్టి కార్యక్రమమునకు మండల అధ్యక్షురాలు రాణి బాయ్,జెడ్పిటిసి గుడాల అరుణ,మహదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ శామ్యూల్,సెరికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి,ఎంపీడీవో శంకర్, తహసిల్దార్ శ్రీనివాస్, మహదేవపూర్ మండల సెరికల్చర్ అధికారి సమ్మయ్య,నాబార్డ్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: