మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
![]() |
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: కాంగ్రెస్ పార్టీ భూపాల్ పల్లి జిల్లా చైర్మన్ దండు రమేష్ ఈరోజు మహదేవ్ పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహాదేవ్ పూర్ మండలంలోని అన్నారం క్రాస్ రోడ్డు, కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల దివంగత శ్రీపాద రావు స్మారకస్తూపం మీద అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు ప్రపంచ మేధావి, భారతరత్న,భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని పెట్టి దళిత,గిరిజన,బహుజనులను మొత్తము భారత జాతిని అవమానపరిచిన దుండగులను పట్టుకోవాలని సంబంధిత పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసి 48 గంటలు గడిచిన కూడా పోలీస్ వారు ఇప్పటివరకు దుండగులను పట్టుకోకపోవడం లో ఆంతర్యం ఏంటి,
ఈప్రాంతంలో కొందరు నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాలకోసం బహుజనవాదం అనే ముసుగు వేసుకుని మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలని చూస్తున్నరు.
ఒక స్మారక స్థూపం మీద ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహం పెట్టి వారిని అవమాన పర్చిన దుండగులను ఇంతవరకు గుర్తించడంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైనదా,లేక అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి దుండగులకు కొమ్ముకాస్తుందో అర్థం కాని పరిస్థితి,ఈరోజు భారత దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడరిల్లుతుంది అంటే కేవలం బాబాసాహెబ్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగంను అనుసరించే విషయాన్ని ఎవ్వరు మర్చిపోవొద్దు.బాబాసాహెబ్ అంబెడ్కర్ గారి మీద ప్రేమ అభిమానం ఉండీ వారి విగ్రహాలు పెట్టాలి అనుకుంటే ఊరిలో ప్రధాన కూడళ్లలో పెట్టాలి కానీ,అడవిలో అంబెడ్కర్ విగ్రహం.. అది ఒక స్మారక స్థూపం మీద పెట్టి అవమానించడం దారుణం.
మంథని నియోజకవర్గం ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మళ్ళీ ఒకసారి 2014 లో లాగా అలజడులు మంథని నియోజకవర్గ ప్రాంతంలో మొదలైన దళితుల హత్యలు,దళితుల మీద దాడులు,కబ్జాలు,దోపిడీలు చేసి,కులాల మధ్య,మతాల మధ్య,వర్గాల మధ్య,జాతుల మధ్య,వైషమ్యాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్పించి మరణహోమం సృష్టించే ఆలోచనతో బహుజనవాదం అనే ముసుగులో,మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మీ స్వార్ధం రాజకీయ ప్రయోజనాలకోసం మహానియుడైన బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని ఒక స్మారక స్థూపం మీద పెట్టించడాన్ని దళిత సమాజం తీవ్రంగా ఖండిస్తుంది.ఈ చర్య వెనక ఎంతపెద్దవాళ్ళు ఉన్నా సరే వారిని మరియు స్మారక స్థూపం మీద బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని అవమానకరంగా పెట్టిన దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని,లేదంటే ఈ ప్రాంత దళిత సమాజం ఊర్కోబోదని పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని,స్మారక స్థూపం మీద అంబెడ్కర్ విగ్రహం పెట్టిన దుండగుల వెనక పోలీస్ వారి హస్తం ఉందని భావించవలసి వస్తుంది.
24 గంటల లోపు దోషులను పోలీసు యంత్రాంగం పట్టుకొని బేడీలు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టి రాజ ద్రోహం కేసును నమోదు చేయాలని, లేనియెడల ఆందోళనలు చేపడుతామని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ భూపాలపల్లి జిల్లా చైర్మన్ దండు రమేష్ తెలియజేశారు.


Post A Comment: