మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండలంలోని అన్నారం మూలమలుపు రహదారి వద్ద రెండు రోజుల క్రితం సిమెంట్ పిల్లర్ పై రాజ్యాంగ రచయిత మహనీయులు అంబేద్కర్ విగ్రహం వెలుబడడంతో కుల సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అజ్మీర పూల్ సింగ్ నాయక్ మాట్లాడుతూ, అన్నారం మూల మలుపు వద్ద వెలిసిన అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు,అదే జరిగితే ఊరుకునేది లేదన్నారు.గతం ఈ ప్రాంతంలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటే అప్పటి పాలకులు మహాదేవపూర్ మండల కేంద్రంలో ఐబి గెస్ట్ హౌస్ ముందు,మహా ముత్తారం మండలం యమన్ పల్లి, కనుకునూరులో కొమరం భీం విగ్రహాలు,బోర్ల గూడెం లో తెలంగాణ తల్లి విగ్రహాల నిర్మాణాలను అక్రమంగా అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టించిన చరిత్ర ఉందని గుర్తు చేశారు.
ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బచ్చల ఎర్రయ్య మాట్లాడుతూ కొమరం భీం విగ్రహ నిర్మాణాలను అడ్డుకునే చరిత్ర శ్రీధర్ బాబుకి ఉందని, మహదేపూర్ లో గల ఆదివాసుల మాడ కార్యాలయంలో మా జాతి నాయకత్వంలో కొమరం భీమ్ విగ్రహం ఏర్పాటును సన్నాహం చేస్తున్న క్రమంలో రాత్రికి రాత్రే శ్రీపాద రావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం,ఏ సంస్కృతితో గిరిజన జాతికి శ్రీధర్ బాబు చెప్పవలసిన బాధ్యత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి హయంలో ఈ ప్రాంతంలో బ్రిటిష్ పాలన చరిత్ర మరిపించారని అన్నారు.
ఈ ప్రాంత బహుజన వాదులు ఆ చరిత్రను మర్చిపోరని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు ఈ ప్రాంతంలో 93%ఉన్న కానీ బహుజన మహనీయుల చరిత్రను తెలువకుండా చేసారాని,మహనీయుల చరిత్ర ఇప్పుడిప్పుడే తెలుసుకోవడంతో బహుజనులు ముందుకస్తున్నారని అన్నారు.కులసంఘాల డిమాండ్ తో ప్రభుత్వం చోరువతీసుకొని ఈప్రాంతన్ని,పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనీ, ప్రభుత్వాన్ని కులసంఘ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భీం సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు
జవాజీ తిరుపతి,ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) జిల్లా అధ్యక్షులు కుమార్ఆదివాసీ.లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అజ్మీరా సమ్మయ్య,బీసీ సంఘం డివిజన్ అధ్యక్షులు దుర్కి కుమార్,దళిత నాయకులు వేమూనూరి జక్కయ్య, సడవలి,తలారి గట్టయ్య, చెకుర్తి శ్రీనివాస్,కావేరి బీసీ నాయకులు పాలిక గణపతి చారి,కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: