పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని,డిసెంబర్,19,ఏడు తరాల పుస్తక సమీక్ష,ఒక మనిషి మరో మనోషిని గౌరవించడం ద్వారా సమాజంలో శాంతి చేకూరుతుందని ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు.పెద్దపల్లి,గోదావరిఖనిలోని,స్నేహసాహితీ గ్రంథాలయంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఏడుతరాలు పుస్తకం సమీక్ష కార్యక్రమానికి"ఖని"ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.విలువలను నిలబెట్టడం విలువలతో జీవించడం వల్లనే సాధ్యం అవుతుందన్నారు,ప్రతీ మనిషిని ప్రతీ మనిషి గౌరవించడం ద్వారా మంచి సమాజం ఏర్పడుతుంది అన్నారు.స్నేహసాహితీ గ్రంథాలయం లాంటి గ్రంథాలయాలు వివిధ వాడల్లో ప్రజలు ఏర్పాటు చేసుకొంటే ప్రజల మధ్య సాన్నిహిత్యంతో పాటు విజ్ఞానం,వికాసం ప్రజలకు లభిస్తుంది అన్నారు,ఈ సందర్భంగా స్నెహసాహితీ నిర్వాహకులను అభినందించారు.ప్రముఖ కోచింగ్ ఫ్యాకల్టీ రవికుమార్ ఏడుతరాలు పుస్తకం సమీక్ష చేస్తూ ఆప్రికా ఖండంలో నుండి మనుషులను ఎత్తుకుపోయి అమెరికా బ్రిటన్ లాంటి దేశాలలో అమ్ముకోవడం,కొన్నవారు ఈ బానిసలను పశువుల కంటే హీనంగా భావిస్తూ పనిచేయించుకున్న విధానాన్ని(ఎలెక్స్ హేలీ)అనే ఈ పుస్తకంలో కళ్ళకు కట్టినట్లు రాశారని అన్నారు,ఇలాంటి వెట్టిచాకిరి,హింసాత్మక పని విధానం మనదేశంలోనూ మరో రూపంలో కొనసాగిందని అన్నారు,పుస్తకం విశ్లేషణ చేసిన రవికుమార్ ను,ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ లను ఈ సందర్భంగా సన్మానించారు,ఈ కార్యక్రమంలో స్నేహ సాహితీ గ్రంథాలయ వ్యవస్థాపకుడు ఏలేశ్వరం వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సారయ్య,ఎరుకల పోచయ్య అదరుసండె సమ్మారవ్ మిట్టపెళ్ళి కుమార్,పుట్ట రాజన్న,ప్రకాశ్ రెడ్డి,వేల్పుల నారాయణ,రాకుమర్,నాగభూషణంగౌడ్,వేముల అశోక్ ఎలకటూరి శంకర్ లు తదితరులు పాల్గొన్నారు


Post A Comment: