ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలో మావోయిస్టు యాక్షన్ టీం సంచరిస్తుoదన్న విశ్వసనీయ సమాచారం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి శనివారం తెలిపారు. నలుగురు సభ్యులు గల మావోయిస్ట్ యాక్షన్ టీం సభ్యుల వివరాలతో ఉన్న వాల్ పోస్టర్ ను ఎస్పి విడుదల చేశారు. మావోయిస్టు యాక్షన్ టీం ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల నుండి 20 లక్షల వరకు నగదు బహుమతి అందిస్తామని, ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. మావోయిస్టులు హింసాత్మక పద్ధతులతో సాధించేది ఏమి ఉండదని, ఆయుధాలు వీడాలని ఎస్పి అన్నారు. ప్రజల అభివృద్ధికి నిరోధకులుగా మావోలు మారారని తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని మండలాలతో పాటు గ్రామాల్లో మావోయిస్టు యాక్షన్ టీమ్ యొక్క సభ్యుల యొక్క వాల్ పోస్టర్ లు ఇప్పటికే విరివిగా అతికించబడ్డాయని మావో యాక్షన్ టీం సభ్యులు గాని అనుమానాస్పద వ్యక్తులుగాని ఎవరైనా కనిపిస్తే, ప్రజలు SP భూపాలపల్లి 8712658100, అదనపు ఎస్పి 8712658111, OSD 8712658101, భూపాలపల్లి డిఎస్పి 8712658103, కాటారం డిఎస్పీ 8712658104 కు గాని స్థానిక పోలీసులకు లేదా డయల్ -100కు గాని సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

Post A Comment: