మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్/ యాదగిరిగుట్ట: ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో రాష్ట్ర పర్యాటకశాఖకు చెందిన హరిత హోటల్‌ను సాంప్రదాయ అతి సుందరమైన హంగులతో తీర్చిదిద్దేందుకు వైటీడీఏ నడుం బిగించింది.దేశ,విదేశీ పర్యాటకుల బస కోసం హోటల్,గెస్ట్‌హౌస్‌తో కూడిన భవన సముదాయాన్ని అన్ని హంగులతో నిర్మించాలంటూ సీఎం చేసిన సూచనల మేరకు,ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఆధ్వర్యంలో నమూనాలను సిద్ధం చేయించింది.కనుమదారిలో దాన్ని నిర్మించనున్నారు. సదరు నమూనాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి,అంగీకారం పొందిన వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించేందుకు వైటీడీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు.సోమవారం హరిత భవన్ నిర్వాహకులు పూజలతో ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అధికారికంగా విడుదల చేయనప్పటికీ సదరు నమూనాలు సోమవారం రోజున వెలుగులోకి వచ్చాయి.

Post A Comment: