మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండము నియోజకవర్గం లో గత 20 సంవత్సరాలుగా పార్టీ పట్ల విధేయతతో నిర్విరామంగా ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో కార్యకర్తల్లో జోష్ నింపుకుంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సుకై నిర్విరామంగా కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రామగుండము నియోజక వర్గ ఇంచార్జి మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ సమర్థతను,నిబద్ధతను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయన మీద నమ్మకంతో పెద్దపెల్లి జిల్లా అధ్యక్ష పదవి కేటాయించడం పట్ల పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి అలాగే మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ కు 1st డివిజన్ రామగుండము నుండి యువ, సీనియర్ నాయకులు హృదయపూర్వక హార్దిక శుభాకంక్షాలు తెలియజేస్తూ కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది, అలాగే రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే గా రాజ్ ఠాకూర్ కు మద్దతుగా తన గెలుపుకోసం ప్రతి ఒక్కరం నిబద్దతతో పనిచేస్తామని ఈ సందర్బంగా తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమములో పల్లికొండ రాజేష్, ప్రేమ్,పల్లికొండ సంతోష్,గట్టు మల్లేష్,కత్తరమళ్ల శ్రీనివాస్,సాబీర్, అలీం, బింగి నరేందర్, బింగి నరేష్, ప్రణయ్,ఇందారపు శ్రీకాంత్, బింగి గంగయ్య, భూమేష్, సతీష్, గారే రవి,చింటు, టీంకు, అనిల్, పళ్ళికొండ మల్లయ్య, చంద్రయ్య తో పాటుగా అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

Post A Comment: