మహాదేవపూర్ మండల ప్రతినిధి దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండలంలోని అన్నారం క్రాస్ రోడ్ అటవీ ప్రాంతంలో, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గాంచిన గొప్ప మహనీయులు,భారత రాజ్యాంగ నిర్మాత,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కొంతమంది దుష్ట శక్తులు కల్పించుకుని పెట్టడంపై ఆ మహనీయుడు అంబేద్కర్ ని అవమానపరిచినట్టేనని, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కొయ్యల సత్యం,మంచినీళ్లు దుర్గయ్య,కోట సమ్మయ్య, లేతకరి రాజబాబు,మాదారి రమేష్ శనివారం రోజు ఇచ్చిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.అన్నారం మూలమలుపు రోడ్డు అడవిలో నిర్మించి ఉన్న దివంగత మాజీ శాసనసభాపతి దుద్దిల్ల శ్రీపాదరావు స్మారక స్తూపంపై అంబేద్కర్ విగ్రహం అమర్చడం పై,కులమతాల ప్రజలకు అందుబాటులో లేకుండా దూరం చేసే కుట్ర, రాజకీయాలకు తెరలేపే ప్రక్రియ స్పృష్టిస్తున్నారని మండిపడ్డారు.దళితుల ఐక్యతను,మహానీయులు అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా, గ్రామానికి దూర ప్రాంత అడవిలో నిర్మించి ఉన్న స్మారక స్థూపం పై కల్పించుకొని,అంబేద్కర్ విగ్రహాన్ని అమర్చిన దుండగులను,సంబంధిత అధికారులు వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Post A Comment: