ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ఈ నెల  18,19,  తేదీలలో నోబెల్ ప్రైజ్ అవార్డు గ్రహిత  కైలాష్ సత్యర్థి  జిల్లా పర్యటనను అధికారులు సమన్వయము తో పని చేసి విజయవంతం చేయాలని కలెక్టర్‌  రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం సాయంత్రం హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు , కుడా  చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్య  తో కలసి  నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహిత  కైలాష్ సత్యర్థి  హన్మకొండ పర్యటన నేపథ్యంలో   ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ ను  పరిశీలించారు.

ఈ  సందర్బంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఈ నెల 18,19, తేదీల పర్యటనలో భాగంగా ఈ నెల  18 న  ఆదాలత్ కోర్ట్ సందర్శన 19 న హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో  భారీ బహిరంగ సభ 50 వేల మంది పాఠశాల విద్యార్థులు హాజరు అవుతారు అని అన్నారు. హన్మకొండ వరంగల్ జిల్లాలా నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 8,9,10 తరగతుల విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలి అని అన్నారు. 

 గ్రౌండ్ లో అనుగుణంగా వేదిక, బ్యారీకేడ్లు, బయటికి, లోపలికి వెళ్ళేదారిని ఇబ్బందులు లేకుండా బాగు చేయించాలని అధికారులకు సూచించారు. బందోబస్తు ఏర్పాట్లను చూడాలని పోలీస్ శాఖ కి సూచించినారు. మైదానం అంత శుభ్రంగా ఉండేలా చూడాలని,  వాటరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.  దీంతో పాటు ఆరోజున విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులకు తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిధితో పాటు అందరికీ వినిపించేలా మైక్, సౌండ్ బాక్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు వివరించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన పనులను పూర్తి చేసేలా, వేడుకలు  విజయవంతం చేయాలని తెలిపారు.   విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి అని అన్నారు. అవసరం అయిన ఎల్ ఈ డి స్క్రీన్ లను  ఏర్పాటు చేయాలి అని అన్నారు.ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులచే దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాలని  అధికారులకు సూచించారు.

 ఈ  కార్యక్రమం లో అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, డిఆర్ఓ  వాసు చంద్ర, డి ఇ ఓ లు అహ్మద్ హై,వాసంతి , కుడా ఈఈ భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: