మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సరస్వతీ శిశు మందిర్ జవహర్ నగర్ పాఠశాల పునఃప్రారంభించాలని నిర్ణయం జరిగింది. గత 50 సంవత్సరాలుగా మాతృ భాష పరిరక్షణే ధ్యేయంగా విద్యార్థులకు విద్యనందించిన పాఠశాల, విద్యార్థులు ఎక్కువగా ఇంగ్లీషు మీడియం వైపు మొగ్గుచూపడంతో గత కొంత కాలంగా తరగతులు నడవడం లేదు. జాతీయ భావనను, పిల్లలలో దేశభక్తిని, సంస్కృతిని పెంపొందిస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు తిరిగి ఇంగ్లీషు మీడియంతో ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. విద్యాపీఠం మంచిర్యాల విభాగ్ అధ్యక్షులు డా. విష్ణువర్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విభాగ్ కార్యదర్శి గోవిందరావు కొత్త ప్రబంధకారిణి ని ప్రకటించారు. ప్రబంధకారిణి అధ్యక్షులుగా శ్రీమతి సోమారపు లావణ్య ఉపాధ్యక్షులుగా డా. క్యాస శ్రీనివాస్ కార్యదర్శిగా గంధం రవీందర్, సహ కార్యదర్శి గా మేడి తిరుపతి, కోశాధికారిగా నలుమాసు సత్తయ్య సభ్యులుగా కొండపర్తి సంజీవ్, కొమ్మల స్వామి, జె. సాయినాథ్ ను సలహా సమితి సభ్యులుగా డా. భగవాన్ రెడ్డి మండ రమాకాంత్ , రాచమల్ల జనార్దన్ , మొగుసాల రమణా రెడ్డి,ముస్కుల భాస్కర్ రెడ్డి, తిప్పర్తి రాజమహేందర్ రెడ్డి, మచ్చ విశ్వాస్ ను మరియు విద్వత్ సమితీలో కుర్మ శ్రీనివాస్, నారాయణమ్మ, కృష్ణకుమార్, దొంగరి నాగరాజులను నియమించారు.
విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ పూదరి సత్యనారాయణ సరస్వతీ విద్యాపీఠం ఆవశ్యకత, విద్యార్థినీ విద్యార్థులను తీర్చిదిద్దున్న క్రమాన్ని వివరించారు.
ఇంకా ఈ సమావేశంలో శారదానగర్ పాఠశాల అధ్యక్షులు బంక రామస్వామిగారు, సోమారపు అరుణ్ కుమార్, ముత్యాల బాలయ్య, లక్ష్మినారాయణ, వివేకానంద కళాశాల ప్రిన్సిపల్ నీలి సంధ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: