మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం, *పెద్దంపేట గ్రామపంచాయతీ సర్పంచ్ మెరుగు భాగ్యమ్మ గురువయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహిత*ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి
పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు *భూషిపాక సంతోష్ మహారాజ్ ను గ్రామపంచాయతీ పాలకవర్గం, ఉపసర్పంచ్ కోడిపుంజుల భూమేష్, వార్డ్ నెంబర్స్ సిబ్బంది అందరూ కలిసి, సత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా *పెద్దంపేట గ్రామ ఉపసర్పంచి కోడిపుంజుల భూమష్ మాట్లాడుతూ మా పెద్దంపేట గ్రామ సుభాష్ నగర్ దళిత ముద్దుబిడ్డ భుష్పాక సంతోష్ మహారాజ్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషకర
, విషయం తెలుసుకొని సర్పంచ్ మాకు చెప్పిన వెంటనే, సర్పంచ్ ఆధ్వర్యంలో అందరం బుష్పాక సంతోష్ మహారాజు నుసన్మానించడం జరిగింది. దీన్ని శృతిగా తీసుకొని రానున్న రోజులలో ప్రజలను చైతన్యపరిచి, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలని, దళిత బడుగు బలహీన వర్గాల వర్గాల ప్రజల అవసరాల కోసం పనిచేయాలని ప్రజలకు ఇంకా దగ్గరగా పనిచేయాలని, సమాజంలో, అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని, దళిత బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్య కు ముందుండి పనిచేయాలని, అన్నారు *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బుషిపాక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ, పెద్దంపేట పాలకవర్గం గ్రామపంచాయతీ సర్పంచ్ మెరుగు భాగ్యమ్మ గురువయ్య ఆధ్వర్యంలో నన్ను సత్కరించడం చాలా ఆనందంగా ఉంది, పెద్దంపేట అంటేనే కవులు కళాకారుల గడ్డ, పెద్దంపేట గ్రామంలో ఎంతమంది కవులను కళాకారులను తీర్చిదిద్దినటువంటి గడ్డ, ఈ గడ్డలో పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తూ బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం, అంబేద్కర్ ఆశయ సాధనలో ఎల్లవేళలా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పైన పనిచేస్తానని బుషిఫాక సంతోష్ మహారాజ్ అన్నారు, ఈ కార్యక్రమంలో పెద్దంపేట గ్రామ ఉపసర్పంచ్ కోడిపుంజుల భూమేష్, వార్డ్ నెంబర్ బండి మహేష్, తుల్ల వెంకటేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, నాయకులు పల్లెర్ల శీను, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా కళాకారుల సంఘం నాయకులు ఇదూనూరి అంజనేయులు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు భూష్పక ప్రేమ్, జిల్లా కార్యదర్శి ఇదూనూరి శ్రీమన్, జాగటి సన్నీ, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: