ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పోలీసులు నిత్యం అప్రమత్తతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మహాదేవ్ పూర్ పోలీసు స్టేషన్ ను ఎస్పి తనిఖీ చేశారు. మొదటగా పోలీస్ స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పోలీస్ స్టేషన్లోని వివిధ రూములను, రిసెప్షన్ సెంటర్, ఉమెన్ హెల్ప్ డెస్క్ లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లోని సిబ్బంది పనితీరు, వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లకు సంబంధించిన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, మిస్సింగ్ కేసులు, దొంగతనాలు మొదలైన ఇతర కేసులను విశ్లేషించి, ఆయా కేసులలో తగిన సూచనలు మరి సలహాలు ఎస్పి తెలియజేశారు. కేసుల ఫైళ్లను పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. దొంగతనాలు నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలనీ, దొంగతనాలు, మిస్సింగ్ కేసులలో టెక్నాలజీ ఉపయోగించి ఛేదించాలని ఆదేశించారు. అలాగే పోలీస్ స్టేషన్ వచ్చే ప్రతి ఫిర్యాదుదారుల పట్ల సానుకూలంగా స్పందించి వారి మనసులో అభద్రతాభావాన్ని, పోలీస్ శాఖ పట్ల విశ్వాసాన్ని పెంపొందించేలా పనిచేయాలన్నారు. ఆ తర్వాత మండలంలో శాంతిభద్రతలు, మావోయిస్టుల కదలికలపై స్థానిక ఎస్సై రాజ్ కుమార్ ని అడిగి తెలుసుకుని, గోదావరి పరివాహక ప్రాంతాలపై డేగ కన్ను వేయాలని ఎస్పి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పి జి రామ్మోహన్ రెడ్డి, మహాదేవ్ పూర్ సీఐ కిరణ్, సిసి ఫసియుద్దీన్ పాల్గొన్నారు.

Post A Comment: