ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లాలోని, ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామి వారి జాతర 2023 జనవరి 12 నుంచి 18 వరకు జరగనున్న నేపథ్యంలో నేడు మల్లిఖార్జున స్వామి దేవస్థానంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతర ఏర్పాట్లు, భక్తుల వసతుల కల్పనపై సమీక్ష కొనసాగిస్తున్నారు.
ఈ సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత , పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు, భవనాలు, రెవెన్యూ, పోలీస్, రవాణా, మున్సిపల్, దేవాదాయ శాఖ, ఎక్సైజ్, వైద్య, ఆరోగ్య శాఖ, ఇరిగేషన్, అగ్నిమాపక శాఖ, సమాచార మరియు ప్రసార శాఖ, మరియు సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Post A Comment: