పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
రామగుండం:పెద్దపల్లి
డిసెంబర్:20:ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగే చిన్న చిన్న నిర్లక్ష్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం రామగుండం ఎన్టీపీసీ.మిలీనియం హాల్ లో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారయణ అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పాల్గొన్నారు.జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో వ్యవసాయ శాఖ,విద్యా శాఖ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ,మత్స్య శాఖ,వైద్య ఆరోగ్య శాఖ,నీటిపారుదల శాఖ కు సంబంధించిన అంశాలను క్లుప్తంగా సభ్యులు చర్చించారు.జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ,ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సఫలీకృతం అయ్యేవిధంగా క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు.జిల్లాలో ఉన్న వైద్య శాఖలో నర్సులు,ఇతర వైద్య సిబ్బందికి రోగులతో వ్యవహారించే ప్రవర్తనపై కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆయన కలెక్టర్ ను కోరారు.ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగే చిన్న,చిన్న పొరపాట్లు బాగా వ్యాప్తి చెందుతాయని,99% రోగులు మంచి వైద్యంతో కోలుకున్నప్పటికి అక్కడ, అక్కడ జరిగే సంఘటనల కారణంగా చెడ్డ పేరువస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వైద్య అధికారులంతా చిన్న,చిన్న పోరపాట్లు కూడా పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.అంగన్వాడి కేంద్రాలకు జిల్లా ప్రజా పరిషత్ కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు.జనవరి 18 నుంచి నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని తెలిపారు.ఓదెల,కాల్వ శ్రీరాంపూర్ వంటి చివరి ఆయకట్టు సైతం సాగు నీరందించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.సమావేశంలో సభ్యులు లెవనెత్తిన అంశాలు,సమస్యల పరిష్కారానికి అధికారులు తమ పరిధి మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు స్పందిస్తూ,రైతుల వద్ద నుంచి 1001 రకం ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా కొనుగోలు కేంద్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని,ఇతర జిల్లాలకు సంబంధించి ధాన్యాన్ని వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మన జిల్లా కోనుగోలు జరిగిన తరువాత కోనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.మన ఊరు-మన బడికి సంబంధించి పనులు పురోగతి మెరుగైందని,మొదటి దశలో ఎంపిక చేసిన 36 మోడల్ పాఠశాలలో సంక్రాంతి నాటికి పెయింటింగ్,ఫర్నీచర్ తో సహా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.జిల్లాలో మొదటి దశలో ఎంపిక చేసిన మిగిలిన పాఠశాలలో పనులు వేగవంతం చేస్తున్నామని,వీటికి సంబంధించిన ఉపాధి హామీ నిధులు,మన ఊరు మనబడి నిధులు వేగంగా క్లియర్ అవుతున్నాయని,మార్చి నాటికి మెజారిటీ పాఠశాలలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు.ప్రాథమిక పాఠశాలలో గది అందుబాటులో ఉండి,సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తరలించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.జిల్లాలో చేపల మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరైన వివరాలు,ప్రస్తుతం స్థితి పై నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని,సభ్యులు తెలిపిన సంఘటనలపై ప్రాథమిక విచారణ చేపట్టి రిపోర్ట్ సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రభుత్వ ఆసుపత్రులలో డబ్బులు వసూళ్ళు చేసే వారిపై సాక్ష్యాలతో సమాచారం అందిస్తే వెంటనే డిస్మిస్ చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ,రామగుండం ప్రాంతంలో వైద్య కళాశాల నవంబర్ 15 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయని తెలిపారు.గోదావరిఖని లో ఉన్న 330 పడకల ప్రాంతీయ ఆసుపత్రి నిర్వహణపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు.పెండింగ్ లో ఉన్న చిన్న,చిన్న మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని సూచించారు.సర్వసభ్య సమావేశంలో ఓదెల జడ్పిటిసి ఘంటా రాములు 50 వేలకు పైబడిన రైతు రుణాలు మాఫీ చేయాలని,జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని,అర్హులైన దివ్యాంగులందరికి అవసరమైన పరికరాలు పంపిణీ చేయాలని,అవకాశం ఉన్నచోట చేపల మార్కెట్లు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని,కరోనా తర్వాత గుండె సమస్య, లివర్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కంటి వెలుగు పరిక్షలతో పాటు గ్రామాల్లో ప్రజలకు జనరల్ చెక్ అప్ చేయించాలని సూచించారు.ఈ సమావేశంలో డిసిఎంఎస్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి,జడ్పీ సీఈవో శ్రీనివాస్,జిల్లా అధికారులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: