మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సిద్దిపేటలో జరిగే సిఐటియు తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియూ అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గిట్ల లక్ష్మారెడ్డి నాంసాని శంకర్ కార్మికులకు పిలుపునిచ్చారు ఎన్టిపిసి ప్లాంట్ గేట్ 2 వద్ద రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ విడుదల చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్ 21 22 23 తేదీల్లో సిఐటియూ రాష్ట్ర 4వ మహాసభలు సిద్దిపేటలో జరగనున్నాయని, ఈ మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మిక చట్టాలు, కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనం 26000/-రూ జీవో విడుదల,కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలపై చర్చించి, భవిష్యత్తు లో చేయబోయే పోరాటాలను రూపొందించడం జరుగుతుందని తెలిపారు.
డిసెంబర్ 23న బహిరంగ సభ సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నామని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులు, కర్షకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పోస్టర్ ఆవిష్కరణలో యూనియన్ నాయకులు దండ రాఘవరెడ్డి, ఎండి యాకూబ్, కాదశి మల్లేష్, వి శ్రీనివాస్, ఎం రాంసత్యనారాయణ, భూమయ్య, నాగభూషణం, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: