ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మాదన్నపేట గ్రామంలో యువకుడి దారుణ హత్య కు గురయ్యారు. గ్రామస్థుల, పోలీసుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం కనుకుంట్ల అక్షయ అనుమానాస్పదంగా మృతిచెందగా, తన కూతురు చావుకి కారకుడు అనే ఉద్దేశంతో గుండపు రాజు(23) అనే యువకుడిని అక్షయ తండ్రి కనుకుంట్ల లెవేందర్ తెల్లవారుజామున కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేసి కడుపులో పొడిచి అతి కిరాతకంగా చంపినట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు లేవేందర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణ లో వాస్తవాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని గ్రామస్థులు భావిస్తున్నారు.

Post A Comment: