చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ప్రపంచ దేశాలలో భారతదేశం బలమైన దేశంగా అవతరించిందని బిజెపి పార్టీ జిల్లా
ఉపాధ్యక్షులు రమనగోని శంకర్ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ వరుసగా ఏడవ సారి భారీ మెజార్టీతో గెలుపొందినందుకు శుక్రవారం
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు.సందర్భంగా రమనగొని శంకర్ మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్ర ఎన్నికల్లో బిజెపి వరుసగా ఏడవసారి
విజయం సాధించడమే కాకుండా 156 సీట్లు సాధించి చరిత్ర సృష్టించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో బిజెపి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో
పట్టణ అధ్యక్షులు ఉడుగు వెంకటేశం గౌడ్, గుజ్జుల సురేందర్ రెడ్డి, ఏసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బత్తుల జంగయ్య గౌడ్, దాసోజు బిక్షమాచారి, కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు, ఉడుగు యాదయ్య గౌడ్,
మాచర్ల గోవర్ధన్ రెడ్డి, ఎల్లంకి పాండు, కాసుల వెంకటేశం, బత్తుల జనార్ధన్, లగోని పాండు, బుడ్డ సురేష్ శంకర్ అధిక సంఖ్యలో బిజెపి శ్రేణులు పాల్గొన్నారు

Post A Comment: