మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
డిసెంబర్ 10, 11 వ తేదీలో ఎన్టిపిసిలో జరిగే పెద్దపల్లి జిల్లా సిఐటియు 3 వ మహాసభలను
విజయవంతం చేయాలని మహాసభల ఆహ్వాన సంఘం గౌరవఅధ్యక్షులు ఎన్ బిక్షపతి, అధ్యక్షులు నాంసాని శంకర్, కార్యదర్శి ఎం రామాచారి, కోశాధికారి గిట్ల లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు ఎండి యాకూబ్, టి రవీందర్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు,
ఈరోజు ఎన్టిపిసి లో పత్రికా విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ పారిశ్రామిక కేంద్రమైన ఎన్టిపిసి లో సిఐటియు పెద్దపెల్లి జిల్లా మూడవ మహాసభలు డిసెంబర్ 10 11 తేదీల్లో నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలకు ముఖ్య అతిథి గా సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షులు ఏం సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, బి మధు హాజరవుతున్నారని తెలిపారు.
ఈ మహాసభలలో కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలపై చర్చించడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల రద్దు తదితర సమస్యలపై చర్చించి, భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ మహాసభలకు పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న సిఐటియు అనుబంధ రంగాల కార్మికులు కర్షకులు మహాసభలకు హాజరు కానున్నారని, మొదటి రోజు డిసెంబర్ 10 శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్టిపిసి ప్లాంట్ గేట్ నెంబర్ 2 నుండి కార్మికులతో టీవీ గార్డెన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లిన అనంతరం బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, రెండవ రోజు ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ర్యాలీ, బహిరంగ సభలను పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలు మరియు మేధావులు అధిక సంఖ్యలో హాజరై ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో నాయకులు దండ రాఘవరెడ్డి,కాదశి మల్లేష్, కే రాజ్ కుమార్, కే పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.ౠ

Post A Comment: