మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి తండా వరకు బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ఒల్లెపు సాయికుమార్ గోదావరిఖని ఆర్టీసీ బస్ డిపో అసిస్టెంట్ మేనేజర్ కి వినతి పత్రం అందజేశారు. బ్రాహ్మణపల్లి తండాకు బస్సు సౌకర్యం లేనందున తండా వాసులు విద్యార్థులు అంతర్గాం మండల కేంద్రానికి కాలినడకన రావాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు. స్కూల్ కళాశాల సమయంలో బ్రాహ్మణపల్లి తండాకి, ఎగ్లాస్పూర్ , ఆకనపల్లి,మరియు ముర్ముర్ కు బస్సు సౌకర్యం కల్పించి గ్రామ ప్రజలు ఆర్టీసీ సేవలు ఉపయోగించుకునేలా కృషి చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు..

Post A Comment: