ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  బ్యాంకర్లకు ఆదేశించారు.

శుక్రవారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. 2023 -24 ఆర్థిక సంవత్సరానికి చెందిన పొటేన్షియల్ లింక్ క్రెడిట్ ప్లాన్   ను విడుదల చేసారు.

ఈ సందర్భంగా ఆయన బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ  పంట  రుణాల కింద 1432 కోట్లు, అనుబంధం  రుణాల  కింద 400కోట్లు.. మొత్తం 4444.46 కోట్ల రూపాయల లక్ష్యం గా నిర్దేశించినట్లు  తెలిపారు. జిల్లా లో రెండవ  విడత  రుణ  మంజూరు సకాలంలో చేయాలనీ  ఆదేశించారు.గత సెప్టెంబరు వరకు  556.85 కోట్లు వ్యవసాయ పంట ఋణాలుగా అందచేయడం జరిగిందని అన్నారు. దీనిలోనే వ్యవసాయ దీర్ఘకాలిక ఋణాలుగా 541 కోట్లతో మొత్తంగా వ్యవసాయ రంగానికి 1178 కోట్లు బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ ఋణాలను సకాలంలో అందించి లక్ష్యాలను సాధించాలని, రైతులు పంట ఋణాలు సకాలంలో చెల్లించేలా అధికారులు క్షేత్ర స్థాయిలో శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. సూక్ష్మ ఋణాల క్రింద సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు గాను 519.44 కోట్లు ఇవ్వడం జరిగిందని, విద్యా ఋణాలుగా14.51 కోట్లు, గృహ ఋణాలుగా 312 కోట్లు అందించడం జరిగిందని,  అంతే కాకుండా ప్రాధాన్యతా రంగాలకు  1750 కోట్లు అందించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మహిళా సంఘాలకు

481  కోట్ల ఋణాలు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, దీనిలో ఇప్పటి వరకు సంఘాలకు గాను 261కోట్లు అందించి46 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని, అర్హత ఉన్న సంఘాలకు ఋణాలు వెంటనే అందించాలని, రెన్యువల్ లో ప్రాసెసింగ్ ఫీజు లేకుండా చూడాలని తెలిపారు.  మెప్మా క్రింద  457సంఘాలకు గాను 25 కోట్ల లక్ష్యం నికి గాను 141 కోట్లు ఋణాలుగా అందించడం జరిగిందని,  అన్నారు.అలాగే వీధి వ్యాపారులకు అందించే 20 వేల రూపాయల ఋణానికి సంబంధించి జిల్లాలో 6172 వీధి వ్యాపారులకు ఇంకా 1369 విధి  వ్యాపారులు కు లోన్ పెండింగ్ ఉందని, వీరిలో ఎస్ బీఐ, యూనియన్ బ్యాంక్ లు ఉన్నాయి అని అన్నారు. సత్వారమే  వారికి  లోన్ మంజూరు చేయాలనీ  అన్నారు. పిఎం ఈజీపి కింద 23 యూనిట్లు మాత్రమే మంజూరు చేయడం  పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. విధులలో  అలక్ష్యం  వీడాలని  ఆయన  హితవు పలికారు.

ఈ  సమావేశం లో లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు, ఆర్బీఐ  నుండి మొహ్మ్మద్ అలీ బాబా, నాబార్డ్  జిల్లా మేనేజర్ చంద్ర శేఖర్ ఎస్బీఐ  రిజినోల్ మేనేజర్ హరికృష్ణ,

పరిశ్రమల  జనరల్ మేనేజర్ హరి ప్రసాద్, మెప్మా పిడి  భద్రు  నాయక్, ఈడి  ఎస్సీ  కార్పొరేషన్ మాధవి  తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: